అనంతలో మంత్రికి అసమ్మతి అసెగలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతలో మంత్రికి అసమ్మతి అసెగలు

అనంతపురం, జనవరి 28, (way2newstv.com)
వైసీపీ నాయ‌కుడు, మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గం పెనుకొండ‌లో అప్పుడే అస‌మ్మతి సెగ త‌గిలింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న శంక‌ర‌నారాయ‌ణ‌పై ఇక్కడి సీనియ‌ర్ నాయ‌కుల నుంచి జూనియ‌ర్ నాయ‌కుల వ‌ర‌కు కూడా అస‌మ్మతి గ‌ళం వినిపించారు. త‌మ‌ను ఏ మాత్రమూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికే మంత్రి ప్రాధాన్యం ఇస్తున్నార‌ని నాయ‌కులు తీవ్రస్థాయిలో ఫైర‌య్యారు. ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన శంక‌ర్ నారాయ‌ణ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పెనుకొండ నుంచి పోటీ చేస్తూ వ‌స్తున్నారు. గ‌తేడాది ఎన్నిక‌ల్లో తొలిసారే ఆయ‌న అసెంబ్లీకి ఎన్నికైనా బీసీ కురుబ సామాజిక‌వ‌ర్గం కోటాలో మంత్రి ప‌ద‌వి సొంతం చేసుకున్నారు.
అనంతలో మంత్రికి అసమ్మతి అసెగలు

ఇక ఆయ‌న పార్టీ కోసం ఎప్పటి నుంచో క‌ష్టప‌డిన వారే కాకుండా వైసీపీకి బ‌ల‌మైన అభిమానులుగా ఉండే రెడ్డి సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వారంతా గుర్రుగా ఉన్నారు. సంక్రాంతి పండుగ రోజున నియోజ‌క‌వ‌ర్గంలోని సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో వైసీపీ అసమ్మతి నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైసీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న ఈదులబళాపురం నాగభూషణ్‌రెడ్డి, అశ్వత్తామ పార్టీ అసంతృప్తి వాదులతో సమావేశమై మంత్రి, మండలంలోని ముఖ్య నాయకుల తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు.వైసీపీ పుట్టినప్పటి నుండి జెండాలు మోశామని, అవమానాల పాలయ్యామని, కేసులు పెట్టారని, అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా, పార్టీ జెండా ముఖం చూడని వారికి పట్టం కడతారా అంటూ మంత్రిపై ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ని ముఖ్యమం త్రిని చేయాలనే ధ్యేయంతో మండల వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేసి, కష్టపడ్డామన్నారు. నాయకులు వస్తే ఖర్చులకు వెనుకాడకుండా పనిచేశామంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని నమ్ముకొన్న కార్యకర్తలకు న్యాయం చేయవచ్చునని భావించా మన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న పలు శాఖల సిబ్బందిని మార్చమ‌న్నా కూడా త‌మ‌ను ఎంత‌మాత్రం పట్టించుకోలేదని అస‌మ్మతి వాదులు ఫైర్ అయ్యారు.పార్టీ కోసం ఓర్చుకొని పోతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌లో ఎంపీపీ, జడ్పీటీసీ జనరల్‌కు కేటాయిస్తే, వాటిని కూడా పార్టీ కోసం పనిచేసిన తమలాంటి వాళ్లకు కాకుండా ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం డబ్బున్న వారికే మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం రాకుండా మంత్రి రిజర్వేషన్లనే మార్పించేశారని విమర్శించారు. గ‌త ఎన్నిక‌ల్లో మంత్రి గెలుపు కోసం క‌ష్టన‌ష్టాలు ప‌డ్డ రెడ్డి వ‌ర్గం నేత‌లు అంద‌రూ ఇప్పుడు ఆయ‌న తీరుపై గుస్సాతో ఉన్నారు. అదే టైంలో ఆయ‌న‌కు జిల్లాలోని రెడ్డి వ‌ర్గం నేత‌ల నుంచి కూడా స‌హ‌కారం లేదు. మ‌రి ఈ క్లిష్ట ప‌రిస్థితుల‌ను దాటి మంత్రి ఎలా ? ముందుకు వెళ‌తారో ? చూడాలి.