టీడీపీకి కొత్త తలనొప్పులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీకి కొత్త తలనొప్పులు

రాజమండ్రి, జనవరి 10, (way2newstv.com)
టీడీపీకి రాజమండ్రి పెట్టని కోట లాంటిది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటినుంచి చూసుకున్నా టీడీపీకి రాజమహేంద్రిలో తిరుగులేని విజయాలనే అందిపుచ్చుకుంది. రాజమండ్రి కార్పొరేషన్ ఏర్పడ్డాక జరిగిన మూడు ఎన్నికల్లో పసుపు పార్టీ పాలకవర్గాలే కౌన్సిల్ లో కొలువుతీరిన చరిత్ర. అలాంటి బలమైన ఇక్కడి టీడీపీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు ఎదురయ్యేలాగే ఉన్నాయి. ఆ పార్టీ స్థానిక నేతలు మూడు గ్రూప్ లు, ఆరు వర్గాలుగా ఆధిపత్య రాజకీయాలు చేస్తూ వస్తున్న నేపధ్యంలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మరో విజయం కష్టం గానే కనిపిస్తోంది.పార్టీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ నడుమ సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది అన్నది వారి కార్యక్రమాలు చూసిన వారికి అర్ధం అయిపోతుంది. 
టీడీపీకి కొత్త తలనొప్పులు

ఒకరి దగ్గరకు వెళితే మిగిలిన వారు దూరం పెడుతున్న సందర్భాలు క్యాడర్ లో గందర గోళానికి దారితీస్తున్నాయి. ప్రస్తుతం సిటీ టీడీపీ ఇంఛార్జ్ లుగా గన్ని కృష్ణ , ఆదిరెడ్డి అప్పారావులు ఉన్నా ఇద్దరు విడి విడి ప్రెస్ మీట్లతోనే రాజకీయం సాగిస్తున్నారు. ఇక గోరంట్ల అదే పంథాలో సాగుతున్నారు. సిటీ పార్టీ కార్యాలయం గోరంట్ల బుచ్చయ్య చౌదరిది కావడంతో వీరిద్దరు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అరుదుగా వస్తుంది. ఆదిరెడ్డి తన ఇంటి దగ్గర, సొంత హోటల్ లో, గన్ని కృష్ణ ఆయన సొంత కార్యాలయం లోను కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు క్యాడర్ ను బాగా అయోమయానికి గురిచేస్తుంది.టిడిపి ఆవిర్భావం నుంచి రాజమండ్రిలో టిడిపికి కర్త, కర్మ క్రియా అన్ని తానే పనిచేసేవారు గోరంట్ల. అయితే ఇప్పటికే తొమ్మిదిసార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలిచిన బుచ్చయ్య పై నేతల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. గోరంట్ల చెంతనే ఉంటే పై స్థాయికి చేరుకోవడం జరిగేది కాదనే అపవాదు ఆయన ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయనతో సఖ్యతగా ఉన్న ఆదిరెడ్డి తన భార్యకు మేయర్ టికెట్ ఇప్పించుకున్నక తిరుగుబాటు జండా ఎగరేశారు. ఆ తరువాత గోరంట్ల ఉండగా తనకు అవకాశాలు రావని వైసీపీలోకి జంప్ అయిన అప్పారావు జగన్ ఆశీస్సులతో ఎమ్యెల్సీ కాగలిగారు.అయితే ఎమ్యెల్సీ గా వుండగానే తన కుటుంబానికి ఎమ్యెల్యే టికెట్ ఇవ్వాలని ఆదిరెడ్డి కోరడం జగన్ అయ్యే పనికాదని తేల్చడం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో అప్పారావు సొంత గూటికి చేరుకున్నారు. అలాగే గత ఎన్నికల్లో తనకోడలు ఎర్ర న్నాయుడి కుమార్తె భవానికి టిక్కెట్ తేవడమే కాదు భారీ మెజారిటీ తో గెలిపించుకున్నారు. రాజమండ్రి రూలర్ నియోజకవర్గంలో గోరంట్ల గెలిచారు. దాంతో ఇద్దరి నడుమ సిటీ ఆధిపత్యం కోసం అంతర్గత యుద్ధం నడుస్తుంది. వీరితోపాటు గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ తన వర్గం తో సాగుతున్నారు. ఈ నేపధ్యంలో గోరంట్ల ఒక మెట్టు దిగి పార్టీని తిరిగి గాడిన పెడతారా లేక అరకొర జోక్యంతోనే సరిపెడతారో చూడాలి.వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహుల ఆందోళన ఇప్పుడు టీడీపీలో అంతా ఇంతా కాదు. త్రిమూర్తులు ముగ్గురి దగ్గరా మార్కులు వస్తే కానీ సీట్ గ్యారంటీ లేదు. తన వర్గంలో కలవరని భావిస్తే వీరు దూరం పెట్టే పరిస్థితి. దీనికి తోడు ప్రస్తుతం పార్టీలో సీనియర్ జూనియర్ నేతల నడుమ సఖ్యత లేకపోవడంతో వచ్చే కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీకి పెద్ద సవాల్ విసరడం ఖాయమనే విశ్లేషకుల అంచనా