చిరు, రామచరణ్ లు సినిమా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిరు, రామచరణ్ లు సినిమా

హైద్రాబాద్, జనవరి 9 (way2newstv.com)
మెగా అభిమానులు పండుగ చేసుకునే వార్త ఒకటి టాలీవుడ్ సర్కి్ల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన మగధీర, బ్రూస్‌లీ సినిమాల్లో మెగాస్టార్‌ చిరంజీవి అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించాడు. అయితే తాజాగా మరో ఇంట్రస్టి్ంగ్ న్యూస్‌ మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది. త్వరలో ఈ ఇద్దరు హీరోలు మరోసారి వెండితెరను పంచుకోబోతున్నారట.సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి, షార్ట్ గ్యాప్‌ తరువాత మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. సందేశాత్మక కథకు కమర్షియల్ టచ్‌ ఇచ్చి తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చిరు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ కీలక పాత్రల్లో నటించనున్నాడట.ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న చరణ్‌, షూటింగ్‌కు డేట్స్‌ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 
చిరు, రామచరణ్ లు సినిమా

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న చెర్రీ, ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే చిరు సినిమాలో రోల్‌ కోసం డేట్స్‌ అడ్జస్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా సీనియర్‌ నటి త్రిష నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.అయితే ఈ సినిమాను 99 రోజుల లోపే పూర్తి చేస్తానంటూ సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్‌ వేదిక సాక్షిగా మెగాస్టార్‌కు మాటిచ్చాడు దర్శకుడు కొరటాల శివ అంటే ఏప్రిల్ 10 లోపే ఈ సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఈ లోగా చరణ్‌, ఆర్ఆర్‌ఆర్‌ పనులు ముగించుకొని చిరు సినిమా డేట్స్‌ ఇస్తాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి