అనంతపురంలో పరిటాల ఫ్యామలీ దూరమవుతుందా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతపురంలో పరిటాల ఫ్యామలీ దూరమవుతుందా

అనంతపురం, జనవరి 31, (way2newstv.com)
అనంత‌పురం జిల్లాకు చెందిన కీల‌క రాజ‌కీయ కుటుంబం ప‌రిటాల ఫ్యామిలీ రాజ‌కీయంగా సంచ‌ల‌న నిర్ణ యం తీసుకునేందుకు రెడీ అయిందా ? కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయంగా టీడీపీలోనే ఉండి, ఎదిగినా, అనేక ఆటు పోట్లు ఎదుర్కొని కూడా నిల‌బ‌డిన ప‌రిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఆ పార్టీకి దూరం దూరంగా ఉండ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. ప‌రిటాల ర‌వి నుంచి ఇప్పటి త‌ర నాయ‌కుడు ప‌రిటాల శ్రీరాం.. రవి స‌తీమ‌ణి సునీత ఇలా అంద‌రూ రాజ‌కీయంగా టీడీపీలో ఓ రేంజ్‌లో హ‌వా చలాయించిన వారే. అనంత‌పురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబానికి రాజ‌కీయంగా క్రేజ్ ఉంది.2014లో ప‌రిటాల సునీత చంద్రబాబు హ‌యాంలో మంత్రిగా ఐదేళ్లపాటు కొన‌సాగారు. 
అనంతపురంలో  పరిటాల ఫ్యామలీ దూరమవుతుందా

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌రిటాల శ్రీరాంను ఎన్నిక‌ల్లో నిల‌బెట్టారు. అంద‌రూ గెలుస్తార‌ని అనుకున్నా జ‌గ‌న్ సునామీ ప్రభావంతో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. సునీత త్యాగం చేసి మ‌రీ త‌న త‌న‌యుడికి టిక్కెట్ ఇవ్వగా శ్రీరాం ప‌రిటాల ఫ్యామిలీ చ‌రిత్రలోనే ఎప్పుడూ లేనంత‌గా ఏకంగా 27 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఆ త‌ర్వాత కూడా చంద్రబాబు యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పిన‌ప్పుడు కూడా శ్రీరాం నేరుగా అమ‌రావ‌తికి వ‌చ్చి చంద్రబాబును క‌లిసి వెళ్లారు. ఇటీవ‌ల రాజ‌ధాని ఉద్యమానికి మ‌ద్దతుగా కూడా సునీత త‌న ఇంటి ముందు రాజ‌ధానికి అనుకూలంగా ముగ్గులు వేసి చంద్రబాబుకు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. అలాంటి ఫ్యామిలీలో ఒక్కసారిగా రాజ‌కీయ కుదుపు వ‌చ్చింద‌నే వార్తలు వ‌స్తున్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ గ్రాఫ్ బాగా దిగజారి పోయింది. రాజ‌ధాని విష‌యంలో చంద్రబాబు ఆందోళన‌కు దిగినా కూడా ఎవ‌రూ కూడా క‌లిసి రాని ప‌రిస్థితి ఏర్పడింది. అనంత‌పురంలోనూ పార్టీ ప‌రిస్థితి ఇలానే ఉంది. కీల‌క‌మైన వ‌ర‌దాపురం సూరి వంటి నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరిపోయారు. ఇక‌, జేసీ వ‌ర్గం కూడా ఎప్పుడు పార్టీని వీడుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలాంటి నేప‌థ్యంలో ప‌రిటాల కుటుంబంకూడా పార్టీకి దూరంగానే ఉంటోంది. వాస్తవానికి రాప్తాడు నుంచి శ్రీరాం ఓట‌మి త‌ర్వాత ఆయ‌న‌కూడా పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్‌లో లేరు.ఇక‌, ధ‌ర్మవ‌రంలో ఇంచార్జ్ పోస్టు ఖాళీఅయింది. దీంతో చంద్రబాబు ఈ త‌ల్లి త‌న‌యుల‌కు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు చూసుకునే బాధ్యత‌ను అప్పగించారు. అయినా కూడా వీరు ఆస‌క్తి చూపించ‌డం లేదు. పైగా మాజీ టీడీపీ నేత‌, ప్రస్తుతం బీజేపీ నాయ‌కుడు, ఎంపీ సుజ‌నా చౌద‌రికి ఈ త‌ల్లీ త‌న‌యులు ట‌చ్‌లో ఉన్నార‌నే ప్రచారం సాగుతోంది. ప‌రిటాల ఫ్యామిలీ పార్టీ వీడుతుందా ? లేదా ? అన్నది క్లారిటీ లేక‌పోయినా వారు పార్టీకి దూరం దూరంగా జ‌రుగుతోన్నది మాత్రం వాస్తవ‌మే. రాష్ట్రంలో టీడీపీకి ఎదురు గాలులు మ‌రింత‌గా పెరిగిన నేప‌థ్యంలో వీరు ఆ పార్టీకి దూరంగా ఉండ‌డంతో ప‌రిటాల ఫ్యామిలీ రాజ‌కీయంగా యూట‌ర్న్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.