జూనియర్ కింద మేం చేయాలా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూనియర్ కింద మేం చేయాలా

సీఎస్ పై గుర్రుగా సీనియర్లు
హైద్రాబాద్, జనవరి 4, (way2newstv.com)
సోమేశ్ కుమార్కు కొత్త సీఎస్గా చాన్సివ్వడంపై కొందరు సీనియర్ ఐఏఎస్లు కినుక వహించినట్టు తెలిసింది. సీనియారిటీ ఉన్నా, తగిన అర్హతలున్నా తమకు అవకాశం ఇవ్వకపోవడంపై పలువురు స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు అలక వహించినట్టు సమాచారం. చాలా జూనియర్ అయిన సోమేశ్ కింద పనిచేయలేమని వారు తమ సన్నిహితుల దగ్గర, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ వద్ద ప్రస్తావిస్తున్నట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమను ఇండిపెండెంట్గా పనిచేసే పోస్టులకు బదిలీ చేయాలని, లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లడం బెటరని భావిస్తున్నట్టు సమాచారం. మరికొందరైతే సెలవుపై వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. 
జూనియర్ కింద మేం చేయాలా

సీఎస్ పదవి చేపట్టిన సోమేశ్ కుమార్ కంటే ప్రస్తుతం 12 మంది సీనియర్లు ఉన్నారు. తమను కాదని సోమేశ్కుమార్ కు సీఎస్ పదవి ఎలా ఇస్తారని కొందరు ఉన్నతాధికారులు సీఎం దగ్గర, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం. ప్రస్తుతం సోమేశ్కంటే సీనియర్లుగా.. బీపీ ఆచార్య (1983 కేడర్), బినోయ్ కుమార్ (1983) , అజయ్ మిశ్రా (1984), పుష్పా సుబ్రమణ్యం (1985), సురేశ్ చందా (1985), చిత్రా రామచంద్రన్ (1985), హీరాలాల్ సమారియా (1985), రాజేశ్వర్ తివారీ (1986), రాజీవ్ రంజన్ మిశ్రా (1987), వసుధా మిశ్రా (1987), శాలిని మిశ్రా (1988), అధర్ సిన్హా (1988) , శాంతికుమారి (1989 ఉన్నారు.సాధారణంగా ప్రతి ఐఏఎస్ అధికారికి సీఎస్ పదవి, ఐపీఎస్ అధికారికి డీజీపీ పదవి చేపట్టాలనే కల ఉంటుంది. ఆ పదవుల్లో ఒక్క రోజైనా ఉండాలని ఆలిండియా సర్వీస్ అధికారులు తరచూ అంటుంటారు కూడా. ఇప్పుడు అలాంటి పదవి తమకు రాకుండా పోయిందన్న బాధ సీనియర్ ఐఏఎస్లలో కనిపిస్తోందని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. సోమేశ్ కుమార్ కంటే ఐదు బ్యాచ్లు సీనియరైన స్పెషల్ సీఎస్, సీఎస్ పోస్టు తీవ్రంగా ప్రయత్నించిన అజయ్మిశ్రాకు ఇంకా ఏడు నెలలు మాత్రమే పదవీకాలం ఉంది. ఆయన ఈ ఏడాది జులై 31తో రిటైర్ అవుతారు. దీంతో ఆయన డ్యూటీలో కొనసాగుతారా, లీవ్లో వెళతారా అన్నది చర్చనీయాంశమైంది. ఆయన భార్య శాలినీ మిశ్రా (1988 బ్యాచ్) కూడా బదిలీపై లేదా సెలవుపై వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, స్పెషల్ సీఎస్ (1988 బ్యాచ్) అధర్ సిన్హా తనను బదిలీ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ‘‘జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నేను నిత్యం సీఎస్ కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నా కంటే జూనియర్ అయిన సోమేశ్ దగ్గరకు నేను వెళ్లలేను. ఇండిపెండెంట్ పోస్టు ఇవ్వండి లేదా కేంద్ర సర్వీసులకు కు వెళతాను. నేను 2018లోనే స్పెషల్ సీఎస్గా అర్హత సాధించినా ప్రమోషన్ ఇవ్వలేదు. ఏడాదిన్నర పెండింగ్ లో ఉంచి స్పెషల్ సీఎస్  పదోన్నతి ఇచ్చారు. అదే సోమేశ్కు ఇటీవలే స్పెషల్ సీఎస్ గా పదోన్నతి ఇచ్చి వెంటనే సీఎస్ ను చేశారు’’ అని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. సోమేశ్ బ్యాచ్ అధికారి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి కూడా తనను ఇండిపెండెంట్ పోస్టు కు బదిలీ చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్ కూడా బదిలీ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.