ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపు
నెల్లూరు జనవరి 08 ( way2newstv.com)
నెల్లూరు రూరల్ లోని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించడమే మేలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. బుధవారం ఉప్పుటూరు లో జరిగిన అభివృద్ధి పథకాల భూమి పూజకు ఎంపీ స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రూరల్ పరిధిలోని 17 గ్రామాల్లో పలు గ్రామాలు ఏకగ్రీవం అవుతాయని భావిస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తో కలిసి ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉప్పుటూరు చిన్న పంచాయతీ అని ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏకగ్రీవం మేలని అభిప్రాయపడ్డారు.
గ్రామాల అభివృద్ధికి ఏకగ్రీవాలు మేలు
రూరల్ లో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మారిందని, ఎన్నికలకు ముందు కొంతమంది నేతలు, ఆ తర్వాత మిగిలిన నేతలు వైసీపీలోకి వచ్చారని తెలిపారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ నామమాత్రం అయిపోయిందని పేర్కొన్నారు.రూరల్ పరిధిలోని గ్రామాల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు కృషి జరుగుతోందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం సంక్షేమానికి అవకాశం ఇస్తుందని చెబుతున్నారని, అందుకు భిన్నంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తయి నిధులు మిగిలిపోతాయని పేర్కొన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇతర నియోజకవర్గాలకు నిధులు కేటాయించవచ్చునని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందరికీ ఇళ్లు, స్థలాలు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు ఆనం విజయకుమార్రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి,రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి గిరిధర్ రెడ్డి, స్వర్ణ వెంకయ్య కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు, నవీన్ కుమార్ రెడ్డి , సుధాకర్ రెడ్డి, కోడూరు కమలాకర్రెడ్డి, అబూబకర్, యేసు నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు ఎంపీ తో సహా నేతలందరినీ ఘనంగా సన్మానించారు.