హైద్రాబాద్, జనవరి 24 (way2newstv.com)
కరొనా వైరస్ అనేది కొన్ని వైరస్ల సమూహం. కరొనా వైరస్లు జంతువులకు మాత్రమే వ్యాపిస్తాయి.. కానీ, ఇందులోనే కొన్ని వైరస్లు మానవులను కూడా ప్రభావితం చేస్తాయి. ఇది వ్యాపించిందంటే చాలు.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇదే ప్రభావం తీవ్రమైతే న్యూమోనియా వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది. అనేక ఇందులో ప్రాణాంతక అనేక క్రిములు ఉన్నాయి.కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు.
మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాప్తి
దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాప్తి
స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
కరోనాతో జరాభద్రం....
వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.
శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
కరోనా లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కో సమయంలో మీకు వ్యాధి తీవ్రత ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండడమే కాకుండా మరి కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.
* జలుబు
*తలనొప్పి
* దగ్గు
* మోకాలి నొప్పులు
* జ్వరం
* పూర్తిగా అనారోగ్యంకరొనా వైరస్లు శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. ఇది కొన్ని సార్లు మిగతా సమస్యలకు కూడా కారణం అవుతుంది. న్యూమోనియా వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.దీంతో పాటు.. కఫంతో కూడిన దగ్గు ఉంటుంది..
ఊపిరి తీసుకోవడమే కష్టం
ఛాతీ దగ్గర నొప్పిగా ఉంటుంది.
గుండె, ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బంది
రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.
కరొనా వైరస్‌ని ఎలా గుర్తించాలి..ఈ వైరస్‌ని గుర్తించడానికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు..
శారీరక పరీక్ష ద్వారా..
రక్త పరీక్ష ద్వారా ఈ వైరస్‌ని గుర్తింపు
కఫం, గొంతు శుభ్రపరుచు, ఇతర శ్వాస పరీక్షల ద్వారా వీటి ఆధారంగా వైరస్‌ని గుర్తిపు.కరొనా వైరస్ వ్యాపించిందింటే కొన్ని రకాల ట్రీట్మెంట్ ద్వారా దీనికి చికిత్స చేయొచ్చు.నొప్పి, జ్వరం, దగ్గుకు మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే, పిల్లలకు మాత్రం,
నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్ ఇవ్వకూడదు.ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.నీరు ఎక్కువగా తాగుతుండాలి.
వైరస్‌ని నివారించవచ్చా..
మానవులలో ప్రవేశించిన కరొనా వైరస్‌కి ప్రజెంట్ చికిత్స విధానమంటూ ఏం లేదు. కానీ, ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం నిరోధించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.