సిరిసిల్ల జనవరి 22 (way2newstv.com)
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. దివ్యాంగ ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రత్యేకంగా తీసుకెళ్లేందుకు వాహనాలు, దివ్యాంగులకు సహాయకులతో కూడిన వీల్ చైర్ లు , ర్యాక్ లు , ప్రత్యేక మరుగుదొడ్లు , కుర్చీలు , సహాయక కేంద్రం , ప్రాథమిక వైద్య కేంద్రం వంటి వసతులు ఏర్పాటు చేసారు .
దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు
ఎన్నికల అధికారులు దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . మున్సిపాల్ ఎన్నికలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం పట్ల దివ్యాంగ ఓటర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం , జిల్లా ఎన్నికల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .