ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ

ముంబై, జనవరి 23 (way2newstv.com)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరో రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తున్నారు. ఇప్పటి జనరేషన్‌కు ఈమె తెలియకపోవచ్చు కానీ.. ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్తే భాగ్యశ్రీ ఓ సెన్సేషన్.‘ప్రేమ పావురాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి భాగ్యశ్రీ. హిందీ చిత్రం ‘మై నే ప్యార్ కియా’కు ఇది తెలుగు అనువాదం. సల్మాన్ ఖాన్ సరసన భాగ్యశ్రీ నటించారు.
ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ

ఈమెకు ఇదే తొలి సినిమా. దీని తరవాత నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘రాణా’లో భాగ్యశ్రీ ఒక పాత్ర పోషించారు. మళ్లీ చాలా కాలం తరవాత ఒక కీలక పాత్రలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు భాగ్యశ్రీ. ‘మిర్చి’ చిత్రంలో ప్రభాస్‌కు తల్లిగా నటించిన నదియా ఆ తరవాత ఎంత బిజీ అయిపోయారో తెలిసిందే. మరి ఇప్పుడు ప్రభాస్‌కు తల్లిగా నటిస్తోన్న భాగ్యశ్రీ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఎస్‌.రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన రెండు సెల్స్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. గత వారం రోజుల నుంచీ ప్రభాస్‌, భాగ్యశ్రీ తదితరులపై ఈ సెట్స్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారంతో భాగ్యశ్రీకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాను పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది