మిషన్ భగీరథ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మిషన్ భగీరథ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయండి

-కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి జనవరి 4  (way2newstv.com)
తాగునీటి ట్యాంకు ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్ లకు కనెక్షన్లు ఇవ్వటంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్ లకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు.   రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె పెబ్బేరు మండలం యాపర్ల గ్రామంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ద్వారా మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన కార్యక్రమాలు, రెండవ విడత చేపట్టనున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. 
మిషన్ భగీరథ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయండి

గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, స్మశాన వాటిక, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, చెల్లింపులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం అన్ని అంశాలపై అడిగి తెలుసుకున్నారు రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుతో పాటు రహదారులకు మొరం వేయనున్నట్లు సర్పంచ్ చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి కలెక్టర్కు వివరించారు.80 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తికాగా 40 పురోగతిలో ఉన్నాయని, 116 ఇంకుడు గుంతల కు చెల్లింపులు చేయవలసి ఉందని, గ్రామంలో ఇంకా 50 మంది వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవలసి ఉందని వారు తెలిపారు.మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని, పైపులైన్లు లీకేజీ ఉన్నాయని, బోరు ద్వారా వచ్చే నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మిషన్ భగీరథ పైప్ లైన్ లకు కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ ప్రశ్నించారు. సంపు స్థలం కారణంగా అలాగే లేబర్ కొరత కారణంగా జాప్యం జరిగిందని అసిస్టెంట్ ఇంజనీర్లు తెలపగా, రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మిషన్ భగీరథ తాగునీటిని ఇవ్వటంలో నిర్లక్ష్యం ఇచ్చినందుకు గాను గ్రిడ్ అసిస్టెంట్ ఇంజనీర్ నవీన్ కుమార్, ఇంట్రా అసిస్టెంట్ ఇంజనీర్ రవితేజ రెడ్డిలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణలను కోరాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో పర్యటించి శానిటేషన్, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా తదితర విషయాలను పరిశీలించారు. గ్రామంలో పాడుబడిన బావి ఉందని దాని కారణంగా అపరిశుభ్రత, దోమలతో పాటు ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ పాడుబడిన బావిని పరిశీలించారు. అలాగే గ్రామం నడిబొడ్డున కాళీ స్థలాలలో చెత్తా చెదారం తో పాటు, చికెన్ సెంటర్ల ద్వారా వచ్చిన వ్యర్థాలను కూడా అక్కడే వేయడంపై గమనించిన కలెక్టర్ గ్రామంలో ఉన్న 4 చికెన్ సెంటర్ యజమానులకు  నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ డంపింగ్ యార్డును పరిశీలించి, పూర్తి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. అంతేకాక గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దహన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పెబ్బేరు జెడ్ పి టి సి పద్మ, ఎంపీపీ శైలజ, సర్పంచ్ చంద్రకళ, డి ఆర్ డి ఓ గణేష్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివ కుమార్, ఆర్డబ్ల్యూఎస్  డిప్యూటీ ఇంజనీర్ మెగా రెడ్డి, డి పి ఓ, తాసిల్దార్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.