ఆన్ లైన్ లో నామినేషన్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆన్ లైన్ లో నామినేషన్లు

హైద్రాబాద్, జనవరి 1, (way2newstv.com)
రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో 61 లక్షల మంది ఓటర్లున్నట్టుగా తేలింది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎలక్షన్‌‌ అథారిటీలుగా ఉన్న కమిషనర్లు డ్రాఫ్ట్‌‌ ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ను  ప్రకటించారు.. మున్సిపల్‌‌ ఓటర్ల డ్రాఫ్ట్‌‌ జాబితా వార్డుల వారీగా పబ్లిష్‌‌ చేశామని, వాటిపై అభ్యంతరాలుంటే జనవరి రెండో తేదీ వరకు చెప్పొచ్చన్నారు. అసెంబ్లీ ఓటర్‌‌ జాబితాలో పేరుండి, మున్సిపల్‌‌ జాబితాలో లేకపోతే అధికారుల దృష్టికి తేవాలన్నారు. 4న ఫైనల్‌‌ ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ పబ్లిష్‌‌ చేస్తామని వెల్లడించారు.  అభ్యర్థులు ఆన్లైన్లోనూ  నామినేషన్ వేయొచ్చని ప్రకటించారు.ఫైనల్‌‌ ఓటర్‌‌ లిస్టు పబ్లిష్‌‌ చేయడానికి ముందే షెడ్యూల్‌‌ ఇచ్చి ఎన్నికల సంఘం కొత్త పద్ధతిని ప్రారంభించిందన్నారు. 
ఆన్ లైన్ లో నామినేషన్లు

మున్సిపల్‌‌ యాక్ట్‌‌లోని195, 197 సెక్షన్ల ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే షెడ్యూల్‌‌ రిలీజ్‌‌ చేశామన్నారు. చట్ట ప్రకారమే షెడ్యూల్‌‌ ఇచ్చామని, ఇందులో ఎలాంటి పొరపాటు లేదన్నారునామినేషన్లు ఎన్నికల నిర్వహణపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జనవరి 7న నోటిఫికేషన్‌‌ ఇచ్చి 8 నుంచి నామినేషన్లు తీసుకుంటామన్నారు. స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ వెబ్‌‌సైట్‌‌లోని ‘టీ – పోల్‌‌’ సాఫ్ట్‌‌వేర్‌‌ నుంచి నామినేషన్‌‌ ఫామ్‌‌లను డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చని చెప్పారు. ఇదే పోర్టల్‌‌ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో కూడా క్యాండిడేట్లు నామినేషన్లు వేసుకోవచ్చని, కానీ సంబంధిత ఫామ్‌‌ను డౌన్‌‌లోడ్‌‌ చేసుకొని ఒరిజినల్‌‌ కాపీని రిటర్నింగ్‌‌ అధికారికి అందజేస్తేనే నామినేషన్‌‌ ఫైల్‌‌ చేసినట్టు అవుతుందన్నారు. ఆన్‌‌లైన్‌‌ ప్రక్రియలో నామినేషన్‌‌లోని అన్ని కాలమ్స్‌‌ ఫిల్‌‌ చేస్తే సంబంధిత నామినేషన్‌‌ రిజెక్ట్‌‌ అయ్యే అవకాశాలు దాదాపు ఉండవన్నారు. మున్సిపల్‌‌ ఎన్నికల విధుల కోసం 35 వేల నుంచి 40 వేల మంది సిబ్బంది అవసరమని అంచనా వేసినట్టు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మున్సిపల్‌‌ ప్రాంత సిబ్బంది పోస్టల్‌‌ బ్యాలెట్‌‌ను వాడుకోవచ్చన్నారు. ఇందుకోసం జనవరి 13 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారుడ్రాఫ్ట్‌‌ ఎలక్టోరల్‌‌ రోల్స్‌‌ తమ ఆఫీసులో, ఈసీ వెబ్‌‌సైట్‌‌లో, సంబంధిత మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉందని ఈసీ నాగిరెడ్డి తెలిపారు. ఓటర్లతోపాటు రాజకీయ పార్టీలు కూడా తమ అబ్జక్షన్స్‌‌ చెప్పవచ్చన్నారు. రిజర్వేషన్లు, ఓటర్‌‌ లిస్టు లేకుండా హడావిడి చేస్తున్నారని కొందరు అంటున్నారని, వాళ్లు కావాలని అలా అంటున్నారా, లేక వాళ్లను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అనే విషయం తెలియడం లేదన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సంసిద్ధత, అనుమతి తప్పనిసరని, ఈ విషయం మున్సిపల్‌‌ యాక్ట్‌‌లోనే ఉందన్నారు. చట్ట ప్రకారం పనిచేస్తున్న తమపై బురద జల్లడం సరికాదన్నారు. ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌లో వ్యక్తమైన సందేహాలను ఆ రోజు సరిగా క్లారిఫై చేయలేకపోయామన్నారు.