ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్.
నిరంతరం ప్రజా సేవకే పాటుపడుతానని,మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.జగిత్యాల పట్టణంలోని 7,8,9, వార్డుల్లోని గోవిందుపల్లి,గోత్రాల కాలనీ ,థరూర్ క్యాంపులలో ఎమ్మెల్యే, తెరాస పార్టీ నాయకులు కలసి శుక్రవారం నాడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నిరంతరం ప్రజా సేవకే పాటుపడుతా
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నందున జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే పట్టణం మరింత అభివృద్ధి చెందే ఆవకాశ ముంటుందన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు .ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసీ టీఆర్ఎస్ కు మద్దతు తెలపాలన్నారు.ఈ ప్రచారంలో పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, మొగిలి,కేఆర్ కృష్ణ ,మహిళ నాయకురాలు లక్ష్మీ తదితరులతో పాటు వార్డుకు చెందిన ఆపార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు