గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబు

తిరుపతి  జనవరి 25 (way2newstv.com)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కమిషనర్ గిరీష ఆదేశాల మేరకు ఆదివారం 26వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో 71 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని,26వ తేదీ ఉదయం 8 గంటలకు కమిషనర్ గిరీష జాతీయ జెండాను ఎగుర వేస్తారు అని నగరపాలక సంస్థ అధికారులకు, సిబ్బందికి మరియు పారిశుధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మరియు అధికారులతో, మున్సిపల్ స్కూల్ హెడ్మాస్టర్ లతో నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో జరుగు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లు దగ్గరుండి అదనపు కమిషనర్ పరిశీలించారు .
 గణతంత్ర దినోత్సవ వేడుకలకు  ముస్తాబు

అదనపు కమిషనర్ హరిత మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు చూసేందుకు రాజకీయ ప్రముఖులు, 44 మున్సిపల్ స్కూల్స్ విద్యార్థిని, విద్యార్థులు, నగర ప్రజలు కు, ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్యాలరీ ఉండాలని, త్రాగు నీరు అందుబాటులో ఉండాలని, నగరపాలక సంస్థ అధికారులకు, సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం, స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఐదువేల మంది హాజరవుతారని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని,ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు విచ్చేస్తారని తెలియజేశారు.ముందుస్తు స్కూల్ విద్యార్థి, విద్యార్థినులు చేసిన సాధనాలు చూపరులను ఆకట్టుకున్నాయి.ముందస్తు ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అదనపు కమిషనర్ వారితో పాటు నగర పాలక సంస్థ అధికారులు, మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులు, స్కూల్ విద్యార్థినిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.