కమ్మ వర్సెస్ రెడ్డి... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కమ్మ వర్సెస్ రెడ్డి...

రాజధానిలో రచ్చ రచ్చ
విజయవాడ, జనవరి3, (way2newstv.com)
వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గం వారి మీద కక్ష కట్టి బతికి బట్టగలరా? కమ్మ సామాజికవర్గం కక్షలకు బలి అయ్యే పరిస్థితుల్లో ఈనాడు ఉందా? ఏపీలో కులాల కంపు ఈ రేంజిలో ఉండబట్టే ఇవన్నీ మాట్లాడుకోవాల్సివస్తోంది మరి. కమ్మ సామాజిక వర్గం పట్ల వివక్ష, కక్షపూరిత విధానాలు జగన్ అనుసరిస్తున్నారని నిన్నటి వరకూ మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు అంటున్నారు. నిజంగా ఇది హాస్యాస్పదమైన, బాధాకరమైన ఆరోపణగా చూడాలి. ఏపీలో జనం మాత్రం ఈ సామాజికవర్గం ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. అతి చేష్టలకు చెక్ పెట్టారు. అంతే తప్ప ఏ జగనో మరొకరో కమ్మ సామాజిక వర్గం పట్ల ద్వేష భావంతో ఏది చేసినా కూడా కుదిరే వ్యవహారం కాదు కూడా.
కమ్మ వర్సెస్ రెడ్డి...

రాష్ట్ర రాజకీయాలను ఒకమారు పరిశీలిస్తే 1982కు ముందు తరువాత అని విభజన గీయాలి. అప్పటివరకూ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీ వంటి పార్టీలు ఉన్నా కూడా కుల ప్రస్తావన ఎక్కడా వచ్చినది లేదు. టీడీపీ రావడంతోనే కులాలు ఒక్కసారిగా ముందుకు వచ్చేశాయి. ఇక తమ కులోద్ధరణ కోసమే టీడీపీ ఆవిర్భవించిందని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. కాంగ్రెస్ రెడ్ల పాలనను అడ్డుకునేందుకు కమ్మలు సొంత పార్టీ పెట్టుకున్నారని కూడా విమర్శలు వచ్చాయి. పరిణామాలు కూడా అలాగే సాగాయి. ఇక టీడీపీలో చూసుకుంటే ఎన్టీఆర్, నాదెండ్ల, చంద్రబాబు ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులూ ఒకే సామాజిక వర్గం. రేపు మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. అంటే ఆ పార్టీలో ఒకే సామాజికవర్గం ఆధిపత్యం ఉందని నడచిన తీరే చెబుతోంది.మరో వైపు కాంగ్రెస్ అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పిస్తూ వచ్చింది. ఆ పార్టీలో రెడ్లు ఎక్కువగా రాజకీయాల్లో ముందు వరసలో ఉన్నా రోశయ్య, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు లాంటి వారు కూడా ముఖ్యమంత్రులు అయ్యారంటే అది పార్టీ గొప్పతనమే. టీడీపీ రాజకీయం మొదలయ్యాక కులాల సమీకరణలు, కూడికలూ, తీసివేతలు అన్ని ఒక్కసారిగా పురివిప్పుకున్నాయన్నది కూడా చరిత్ర చెప్పిన సత్యం. ఇక సామాజికంగా బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గం వారు అన్నింటా వివిధ రంగాలలో ముందున్నారు. వారిని వెనక్కి నెట్టే పరిస్థితి ఎప్పటికీ లేదు, ఎవరూ చేయలేరు కూడా.నీటిని నాచు తెగులు అన్నట్లుగా కమ్మలకు సొంత వారి నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నది సత్యం. కమ్మలు తప్ప తెలివైన వారు ఏపీలో ఎవరూ లేరని నాటి బాబు సర్కార్లో అధికారిక పదవులు అన్నీ కట్టబెట్టారు. అధికారుల పోస్టులు కూడా వారికే ఎక్కువగా ఇచ్చుకుంటూ పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక అందరి రాజధాని అమరావతి విషయంలో కూడా ఆ సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న చోటనే పెట్టి లాభం వచ్చేలా చూశారని విమర్శలు ఉన్నాయి.ఇక విభిన్న పార్టీలు, రాజకీయ సిధ్ధాంతాలు అన్న భేదం లేకుండా అమరావతి రైతులను ఓదారుస్తున్న కమ్మ సామాజికవర్గం ప్రతినిధులను చూసినపుడు అక్కడ రాజధాని ఎవరి కోసమే వారే చెప్పేసుకుంటున్నారు. ఇలా తామే చిరిగి చాట చేసుకుంటూ జగనో మరెవరో కక్ష కడుతున్నారని ఏడవడం తమ్ముళ్లకే చెల్లిందని అంటున్నారు. ఇలా ఎంత ఎక్కువగా అమరావతి పేరిట రాగాలు తీస్తే అది కమ్మ సామాజికవర్గం వారికే చేటు తెస్తుందని, ఇందులో వేరెవరి ప్రమేయం లేకుండానే మిగిలిన సమాజం ముందు వారే బయటపడిపోతారని కూడా విశ్లేషణలు ఉన్నాయి.