రైతులకు తప్పని గౌడన్ కష్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులకు తప్పని గౌడన్ కష్టాలు

కర్నూలు, జనవరి 6, (way2newstv.com)
ఆరుగాలం పొలాల్లో కష్టించి పండించిన పంట దిగుబడులను అమ్ముకునేందుకు  రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ ఫెడ్ వారికి సరుకును అమ్మినా గౌడన్లు ఖాళీ లేకపోవడంతో.. పగలు రాత్రులు అని చూడకుండా వేరుశనగ పంట దగ్గర రైతన్న పడిగాపులు కాస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం అసలే చలికాలం ఎముకలు కొరికే చలిలో రైతులు ఇబ్బందుల పడుతున్నారు..తెల్లవారుజామున నాలుగు గంటల సమయములో చలిలో చలికి తట్టుకోలేక చలి మంటలు కాపుకుంటున్నా దృశ్యాలను మరియు తెచ్చిన తమ పంట దగ్గరే పడిగాపులు కాస్తున్నా రైతన్నా దృశ్యాలు కనిపిస్తున్నాయి.వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధర నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకు కొనుగోలు చేసేలా కేంద్రాలను ప్రారంభించింది. 
రైతులకు తప్పని గౌడన్ కష్టాలు

కర్నూలు జిల్లాలో దాదాపు 6 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఈ కేంద్రాలను ప్రారంభించారు.అందులో భాగంగా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి కొనుగోలు చేస్తున్నారు.  ఆయిల్ ఫెడ్ తరుపున కేడీసీఎంసీ సిబ్బంది రైతులు తెచ్చిన వేరుశనగ పంటను తూకాలు వేసి ఆదోని లోని సెంట్రల్ వేర్ హౌస్ గోడాన్ కు లారీల ద్వారా తరలించాలి. కానీ, లారీలు సక్రమంగా రాకపోవటంతో 10 రోజులుగా వేరుశెనగ బస్తాలు పత్తికొండ కొనుగోలు కేంద్రంలోనే ఉంచేశారు..మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన పంట రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఆదోనిలో ఉన్న గోడౌన్స్ నిండిపోవడంతో ఇక్కడున్న సరుకును తరలించడానికి వీలుకాక పది రోజులుగా అమ్మిన సరుకుకు టోకెన్లు ఇవ్వక పోవడంతో  రైతులు పడుతున్న అగచాట్లు వర్ణనాతీతం. అమ్మిన సరుకు అధికారులు తీసుకోకపోవడం... ఆరుబయట ఉన్న పంట దగ్గర చలికి వణుకుతూ కాపాలా కాస్తున్నారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని రైతులు కోరుతున్నారు.ఇటు రైతుల నుంచి భారీగా సరుకు రావడంతో  గౌడన్లు నిండిపోయాయని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గరే రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాట్లు చేస్తామన్నారు.అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం గౌడన్లలు తక్కువగా ఉండటంమో రైతులకు మాత్రం కష్టాలు తప్పదం లేదు. ఏది ఏమైనప్పటికి అధికారులు స్పందించి రైతుల సరుకును తీసుకుపోవాలని కోరుతున్నారు.