కమలంలో మున్సిపల్ టిక్కెట్లకు డిమాండ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కమలంలో మున్సిపల్ టిక్కెట్లకు డిమాండ్

హైద్రాబాద్, జనవరి 10, (way2newstv.com)
బీజేపీలో మున్సిపల్ టికెట్ల కోసం డిమాండ్ పెరిగింది. ఎంపీలు ఉన్న జిల్లాల్లో, బలమైన లీడర్లు ఉన్న చోట ఆశావహుల సంఖ్య బాగా పెరిగింది. అభ్యర్థులను వెతుక్కోవాల్సిన స్థితి నుంచి టికెట్ కోసం పోటాపోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఎంపీలున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో, బలమైన లీడర్లున్న ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు, పెద్దపల్లి, మంచిర్యాల వంటి ప్రాంతాల్లో పోటీ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. వీటన్నింటిలో టీఆర్ఎస్ కు నువ్వా నేనా అన్నట్టుగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.అసెంబ్లీ ఎలక్షన్ల రిజల్ట్ బీజేపీని నిరాశపర్చినా.. లోక్సభ ఎలక్షన్లు ఆ పార్టీకి కొత్త ఊపు తెచ్చాయి. అప్పటి నుంచి కమలం పార్టీలోకి వలసలు పెరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీల నుంచి కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు బీజేపీలోకి క్యూ కట్టారు. 
కమలంలో  మున్సిపల్ టిక్కెట్లకు  డిమాండ్

వారి వెంట పెద్ద సంఖ్యలో జిల్లా స్థాయి లీడర్లు, అనుచరులు, కార్యకర్తలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మున్సిపల్ ఎలక్షన్లలో టికెట్ల కోసం లీడర్ల మధ్య పోటీ పెరిగింది. కొన్ని చోట్ల ఒక్కో డివిజన్/వార్డుకు ఏడెనిమిది మంది వరకు పోటీ పడుతుండటం గమనార్హం.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్  పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్ తోపాటు, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ బీజేపీ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మున్సిపాలిటీలున్నాయి. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు ఉత్సాహంగా ఉన్నారు.ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సీటు పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ టికెట్ కోసం పోటాపోటీ నెలకొంది.ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ పలు కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో టికెట్లు ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉందిజీహెచ్ఎంసీకి ఎన్నికలు లేకపోవడంతో సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమీపంలో ఉన్న చేవెళ్ల, మల్కాజిగిరి సెగ్మెంట్ల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల బాధ్యతను బీజేపీ హైకమాండ్ అప్పగించింది. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకున్న వాటిలో బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట కార్పొరేషన్లు.. శంషాబాద్, మేడ్చల్, ఘట్ కేసర్, కొంపల్లి, దుండిగల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్ వంటి కీలక మున్సిపాలిటీలు ఉన్నాయి. సిటీకి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో పార్టీ టికెట్ కోసం పోటీ ఉంది.మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గతంలో ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో బీజేపీ బలపడింది. ఈ పరిధిలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంచిర్యాల వంటి కీలక మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో లీడర్లు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిల సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోనూ బీజేపీ లీడర్లలో ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు.