అమరావతి జనవరి 20 (way2newstv.com)
అమరావతి ఐకాస, విపక్షాలు చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన దృష్ట్యా సచివాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులు వెళ్లే గేట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
సచివాలయ ప్రాంతంలో భారీ బందోబస్తు
గుర్తింపు కార్డు పరిశీలించి, క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.మందడం వెళ్లే మార్గంలో పోలీసులు వలలు కుడా సిద్ధం చేసారు.