శీతాకాలంలో భారీగా పెరిగిన విద్యుత్ వాడకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శీతాకాలంలో భారీగా పెరిగిన విద్యుత్ వాడకం

ఏలూరు, జనవరి 20, (way2newstv.com)
శీతాకాలంలోనూ విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ఇప్పటి నుంచే వేసవి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంస్థ పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక్క విశాఖ జిల్లాలోనే విద్యుత్ వాడకం ఎక్కువ శాతంలో ఉంటోంది. వేసవి సీజన్ సమీపిస్తుండటంతో ఈ వాడకం మరింతగా పెరగనుందని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. 
 శీతాకాలంలో భారీగా పెరిగిన విద్యుత్ వాడకం

అందువల్ల వేసవి డిమాండ్‌ను ముందుగానే అంచాన వేస్తున్న సంస్థ యాజమాన్యం దీనికి తగినట్టుగా విద్యుత్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం సంస్థ పరిదిలోకి వచ్చే ఐదు జిల్లాలకు సంబంధించి 56 లక్షలకు పైగానే విద్యుత్ సర్వీసులుండగా వాడకం చూస్తే 40 మిలియన్ యూనిట్లకు పైగానే ఉంటోంది. ఇది కూడా కొన్ని సందర్భాల్లో పెరుగుతోందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాకు సంబంధించి రోజూ 25కు మించి మిలియన్ యూనిట్ల మేర వాడకం ఉంటోంది. ఈ విధంగా గత ఆరేళ్లకాలంలోనే విద్యుత్ వాడకం ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుండగా, తొలుత 15నుంచి 20 మిలియన్ యూనిట్ల వరకే ఉండేది