గ్రామాలకు వ్యాపిస్తున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామాలకు వ్యాపిస్తున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్

విశాఖపట్టణం, జనవరి 11, (way2newstv.com)
విశాఖలో అంతే వేగంగా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ విస్తరిస్తుంది. నగరాల్లోనే ఎక్కువగా కనిపించే పాస్ట్ ఫుడ్ వాడకం క్రమేపీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకింది.  ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతుండటంతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. యువత, విధ్యార్దులు, ఉద్యోగులు యాంత్రిక జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట గడుపుతుంటారు.. అటువంటి వారికి ఆకలి తీర్చేందుకు అందుబాటులో ఉండే పదార్దాలలో ప్రముఖంగా ఫాస్ట్ ఫుడ్ ఒకటి... సాయంత్రం వేలల్లో ఇంటికి వచ్చేటప్పుడు, ఇంటినుంచి బయటకు వెల్లేటప్పుడు రోడ్ల పక్కను స్టాల్స్ లో నోరూరిస్తూ చక్కని రంగులతో మసాల వాసనతో ఘమఘమ లాడే ఫాస్ట్ ఫుడ్స్ ను ప్రతి ఒక్కరు తినాలనుకోవడం సహజం. ప్రస్తుతం పాస్ట్ ఫుడ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి.
 గ్రామాలకు వ్యాపిస్తున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్

ఈ సెంటర్లతో యువతకు ఉపాధి కల్పిస్తున్నా.. నిర్వహణ, ఆహార పదార్థాల తయారీలో శుచీ,శుభ్రత పాటించకపోవడం, కంటికి అందంగా కనబడేలా కృత్రిమ రంగుల వాడకంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.రహదారి పక్కన తోపుడు బండ్లపై విక్రయించే నూడిల్స్‌, గోబీ మంచూరియా, పానీపూరీ, ఫ్రైడ్‌రైస్‌, చికెన్‌ ఫ్రైలు వంటి ఆహారం తినేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతుంటారు.  అనారోగ్యం బారిన పడతామని తెలిసినా.. ఆరగించేందుకే ఆసక్తి చూపుతున్నారు. పాస్ట్ ఫుడ్  సెంటర్లలో విక్రయించే ఆహారాన్ని తరచూ తినడం వల్ల జబ్బుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. విశాఖ జిల్లాలో 12 వేలకుపైగా పాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో కనీసం 10 శాతం కూడా నిర్ధిష్ట ప్రమాణాలను పాటించి ఆహార పదార్థాలను తయారు చేయడం లేదన్నది వాస్తవం. ఏ పాస్ట్ ఫుడ్  సెంటరు చూసినా జనంతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి.ఎగ్‌ ఫ్రైడ్‌రైస్‌, నూడిల్స్‌, ఎర్రగా కాలిన చికెన్‌ ముక్కలను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. వీటిని తయారు చేసిన విధానం చూస్తే వాటి జోలికి వెళ్లం. హోటళ్లలో ఎంతో కాలం నుంచి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చికెన్‌ ముక్కలను తీసుకుని వాటిని వెనిగర్‌లో ముంచుతారు. ఇలా చేయడంతో చికెన్‌ పాడైనా... వాసన మాత్రం రాదు. దీనికి కొంత రంగు, పిండి కలిపి నూనెలో వేయిస్తారు. పాస్ట్ ఫుడ్  ను మూడు నుంచి ఐదు నిమిషాల్లో తయారు చేసి వినియోగదారుకు అందజేస్తారు. ఇలా చేయడానికి మోనోసోడియం గ్లూకోమేట్‌ వాడుతారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వాడే పెనం అపరిశుభ్రంగా ఉంటోంది. దీన్ని కడిగితే దానికి అంటి ఉన్న నూనెపోయి అది వేడి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో పాత్రను కడగకుండానే వాడుతున్నారు. ఇదీ రోగాలకు ఓ కారణమవుతోంది. దుకాణాల్లో తక్కువ ధరకు లభించే నాసిరకం కారంపొడి పొట్లాలను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఈ కారం తింటే జీర్ణాశయం, సంబంధిత వ్యాధులు బారిన పడటం ఖాయమంటున్నారు వైద్యులు.ప్రస్తుత కాలంలో విశాఖ నగరంతో పాటు జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి... ఏజెన్సీ ప్రాంతాలయిన పాడేరు, చింతపల్లి ,అరుకు వంటి ప్రాంతాల్లోని పాస్ట్ ఫుడ్ సెంటర్ల వ్యాపారం జోరుమీద ఉంది. ఈ సెంటర్లలో ఒకటికి రెండుసార్లు మరిగిన నూనెను వాడటం వల్ల ఆహార పదార్థాలు విషపూరితమవుతున్నాయి. చిన్న పిల్లలు అధికంగా ఫాస్ట్‌ఫుడ్‌కు ఆకర్షితులవుతున్నారు . ఫాస్ట్ ఫుడ్ ను అధికం గా తీసుకోవడం వలన చిన్న వయస్సులోనే  ఊబకాయం, అనేక అనారోగ్య సమస్యలుకు గురవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆహారపు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా డాక్టర్లు చూచిస్తున్నారు.