తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు చినుకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు చినుకులు

హైద్రాబాద్, జనవరి 3(way2newstv.com)
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పొడి వాతావరణం ఏర్పడొచ్చని చెప్పింది. గురువారం గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు చినుకులు పడ్డాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కుమ్రంభీం జిల్లాలోని గిన్నెదారిలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ నుంచి 2.1 కి.మీల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు ఏపీ, తెలంగాణల్లో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు చినుకులు

వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో.. వర్షాలు కురవనున్నాయి. మరో రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్యం నుంచి వీచే చలి గాలులు ఆలస్యంగా రావడంతో.. చాలా రోజులపాటు చలి తక్కువగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.జనవరి 3 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రయివేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ తెలిపింది. వర్షాలు, మేఘాల కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా.. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పింది. జనవరి 4 నుంచి ఆకాశం నిర్మలంగా మారుతుందని.. మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో అక్కడక్కగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతల్లో గురు, శుక్రవారాల్లో సైతం ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.