కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగలు

అనంతపురం జనవరి 6 (way2newstv.com)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డికి సోమవారం అనంతపురంలో నిరసన సెగలు ఎదురయ్యాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను అడ్డుకునేందుకు వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు ప్రయత్నించారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థి సంఘం నాయకులపై దాడిని నిరసిస్తూ కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థులు యత్నించారు. 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగలు

దాడులను ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మతోన్మాద గుండాలు కిరాతకంగా విద్యార్థి నాయకులపై దాడులు చేయడాన్ని ఆందోళనకారులు ఖండించారు. కాగా, జేఎన్‌యూలో విద్యార్థి నేతలపై దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు నిరసనల గళాలు విన్పిస్తున్నారు. దుండగులను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.