హైదరాబాద్ జనవరి 02 (way2newstv.com)
పర్యావరణ రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు అందరూ నిజాయితీగా, అంకితభావంతో పనిచేయాలని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ పిలుపు నిచ్చారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో పీసీసీఎఫ్ తో పాటు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అరణ్యభవన్ లో జరిగిన కొత్త సంవత్సర వేడుకలు
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఇచ్చిన జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం స్ఫూర్తిని కొనసాగించాలని, సమయ పాలన పాటిస్తూ నిబద్ధతతో పనిచేయటం ఒక్కటే అటవీ శాఖలో ప్రతీ ఒక్కరి ప్రాధాన్యతగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి ఉద్యోగులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ అటవీ అధికారుల సంఘం తయారు చేసిన క్యాలెండర్ ను ఉన్నతాధికారులు ఆవిష్కరించారు.