నమూనా పోలింగ్ కేంద్రాల్లో.... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నమూనా పోలింగ్ కేంద్రాల్లో....

ఏర్పాట్లు భళా
సిరిసిల్ల, జనవరి 22  (way2newstv.com)
పెళ్లి వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు నా ప్రవేశ ద్వారం, రెడ్ కార్పెట్ స్వాగతం, ప్రవేశ మార్గం ఇరువైపులా ఆహ్లాద వాతావరణం ఉట్టి పడేలా పచ్చని మొక్కలు, చూపరులను కట్టిపడేసే అరటి మొక్కల అందాలు, యువతను ఆకర్షించే సెల్ఫీ పాయింట్లు విశాలమైన ప్రాంగణంలో వేసిన టెంట్లు... ఔరా అనిపించే ఏర్పాట్లు.... ఇవన్నీ పెళ్లి వేడుక కో.... ఏ శుభకార్యానికి చేసిన ఏర్పాట్లు కాదు.బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వేములవాడ, సిరిసిల్ల పట్టణాలలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మోడల్ పోలింగ్ కేంద్రాలు. అన్ని వయసులో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఆకర్షించేందుకు కు తద్వారా ఓటరు నమోదు శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు చొరవతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నమూనా పోలింగ్ కేంద్రాల్లో....

వివరాలలోకి వెళితే సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని శివ నగర్ లో కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వేములవాడలోని పట్టణంతో సహా కోనాయిపల్లి లో మోడల్ కేంద్రంలో లో ఓటర్ల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల్లో సకల సదుపాయాలు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.వికలాంగులు, గర్భిణులు, వృద్ధులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు, ఎండ తీవ్రతనుంచి రక్షణ కల్పించేందుకు షామియానాలు ఏర్పాటు చేశారు.వృద్ధులకోసం వీల్ఛైర్ను అందుబాటులో ఉంచారు. మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించారు. ఓటింగ్ జరుగు తున్నప్పుడు క్యూలైన్లలో సమస్యతలెత్తకుండా లోపలికి, వెలుపలికి వేర్వేరు దారులను సైతం కల్పించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకోసం ప్రాథమిక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో అవసరమైన మందులతోపాటు వైద్య, శిశుసంక్షేమ శాఖ సిబ్బందిని అందుబాటులోవుంచారు. నమూనా పోలింగ్ కేంద్రం లే అవుట్ హోటళ్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.ప్రత్యేక ఆకర్షణ గా సెల్ఫి పాయింట్ లుప్రస్తుత ప్రపంచంలో సెల్ఫీల క్రేజీ తెలిసిందే. యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఆకర్షించి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు యువతులు సెల్ఫీ లకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మోడల్ కేంద్రాల్లో సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు దీంతో పెద్ద ఎత్తున యువత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు వేసిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారులు మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్లకు వద్దకు వచ్చి తాము ఓటు హక్కు వినియోగించుకున్న ట్లు తెలియజేస్తూ ఇచ్చిన సంకేతం తో సెల్ఫీలు దిగారు. యువతతో పాటు, పలువురు తమ కుటుంబ సభ్యులతోపాటు సెల్ఫీలు దిగి దిగారు. అనంతరం ఈ ఫోటోలను ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు ఫేసు బుక్  పోస్ట్ చేసి ఇ తమ బంధువులు స్నేహితులతో పంచుకున్నారు.