న్యూఢిల్లీ జనవరి 6 (way2newstv.com)
సినీ నటుడు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని సోమవారం కలిసారు. ప్రధానితో మోహన్ బాబు దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. మోదీతో భేటీ తర్వాత మంచు లక్ష్మి ఈ సమావేశానికి సంబంధించి ట్వీట్ చేసారు. ఇప్పుడే డైనమిక్ ప్రధాని మోదీని కలిశామని, మోదీ సారధ్యంలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మంచు లక్ష్మి ట్వీట్ చేసారు.
ప్రధాని మోడీతో మోహన్ బాబు భేటీ