మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జోరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జోరు

వంద స్పీడులో కారు
హైద్రాబాద్, జనవరి 25, (way2newstv.in)
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దూకుడు కొనసాగింది. తిరుగులేని జోరుతో కారు  దూసుకుపోయింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కారు సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలోనూ గులాబీ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్‌లో కారుకు ఎదురులేదు. ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. భైంసా మినహా  ఇక్కడ అన్ని మున్సిపాలిటీల్లోనూ కారు విజయం సాధించింది. ఇక, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ దూకుడు మీద ఉంది. 
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జోరు

కామారెడ్డి మినహా అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.మున్సిపోల్స్‌లో ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు..  కేసీఆర్ ప్ర‌భుత్వంపై పాజిటివ్ సంకేతాల‌ను చూపుతున్న‌ది.  గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. రాష్ట్రంలో పాజిటివ్ ఓటు పెరిగిన‌ట్లు రికార్డులు స్ప‌ష్టం చేస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్‌కు 47 శాతం ఓటు షేర్ వ‌చ్చింది. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో సుమారు 51 శాతం ఓటు షేర్ వ‌చ్చిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు వెల్ల‌డిస్తున్నారు.  తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు విఫ‌లం అయిన‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.  కాంగ్రెస్‌, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు.. ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్నా.. అవేమీ చేయ‌లేక‌పోయాయి.  ఆ పార్టీల‌కు ఐడెంటీ లేకుండాపోయింది. యువ రాష్ట్రంగా తెలంగాణ అన‌న్య ప్ర‌గ‌తి సాధిస్తున్న‌ది.  గ‌త ఆరేళ్ల‌లో సాధించిన ఆ పురోగ‌తి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. అందుకే పుర ఓట‌ర్లు.. టీఆర్ఎస్‌కు ప‌ట్టం క‌ట్టార‌న్న విష‌యం తాజా ఫ‌లితాల‌తో వెల్ల‌డ‌వుతోంది.  తెలంగాణ ప‌ట్ల ఏ ర‌క‌మైన వ్యూహాంతో వెళ్లాల‌న్న ల‌క్ష్యం జాతీయ పార్టీల‌కు లేకుండాపోయింద‌ని ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.  అందుకే ఆ పార్టీల‌ను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించిన‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.  గ‌త ఆరేళ్ల‌లో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి.. స‌హ‌జంగా జ‌రిగింద‌న్నారు.  తెలంగాణ ప్ర‌భుత్వం నీటికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది.  తాగునీరు, పంట పొలాల‌తో తెలంగాణ ప‌చ్చ‌ద‌నంగా మారింద‌న్నారు.  దేవాదుల నుంచి వ‌చ్చిన నీటితో జ‌న‌గామ లాంటి ప్రాంతంలో అనేక చెరువులు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌న్నారు.  చాలా వ‌ర‌కు ప‌ట్ట‌ణాలు ఇలాంటి నీటి స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, అందుకే ప‌ట్ట‌ణ ఓట‌ర్లు .. పుర ఎన్నిక‌ల్లో గులాబీకి ప‌ట్టం క‌ట్టార‌న్నారు.రాష్ట్రంలో గ‌త కొన్నేళ్లుగా విద్యుత్ కొర‌త కూడా లేదు. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డంలో.. ఇది కూడా ప్ర‌ధానాంశం.   గ‌త ఆరేళ్లుగా తెలంగాణ‌లో ఎటువంటి హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు లేవు.  లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య‌లు లేవు.  శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయి.  హ్యాపీగా బ్ర‌తుకుతున్నామ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ప‌ట్ట‌ణ ఓట‌ర్లు.. కేసీఆర్ ప్ర‌భుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎటువంటి బ‌ర్నింగ్ స‌మ‌స్య లేద‌ని, కానీ కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు ఏం చేయాలో తెలియ‌క‌.. టీఆర్ఎస్ నాయ‌క‌త్వంపై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
నా బాధ్యత మరింత పెరిగింది : కేటీఆర్
మున్సిపల్‌ మంత్రిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. శనివారం వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ జోరు కొనసాగుతోంది. పలు చోట్ల పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. తెలంగాణ భవన్‌లో పలువురు మంత్రులు, పార్టీ నేతలతో ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.మున్సిపల్ ఎన్నికల ఫలితాల పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. 120 మున్సిపాలిటీల్లో 100కు పైగా గెలుచుకోవడం, తొమ్మిదింటికి తొమ్మిది కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం అనితరసాధ్యమైన విషయం అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం లభించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అత్యధిక మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీనే కైవసం చేసుకుంది.మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల సరళిపై టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఫలితాలను తెలుసుకుంటున్నారు. అటు మేయర్‌, ఛైర్‌పర్సన్ల ఎన్నికల నేపథ్యంలో ఎక్స్‌ఆఫిషీయో ఓట్లపై కేటీఆర్‌ చర్చిస్తున్నారు.మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఎక్స్‌ఆఫిషీయో ఓటును ఎక్కడ నమోదు చేసుకోవాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. కార్పొరేషన్‌ మేయర్‌ లేదా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు ఏ స్థానంలో మెజార్టీ తక్కువైతే అక్కడ తమ ఎక్స్‌అఫిషీయో ఓట్లు ఉండేలా చూడాలని ఎంపీలు, ఎమ్మెల్సీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు