హైద్రాబాద్, జనవరి 3, (way2newstv.com)
ఆర్టీసి అధికారులు ఆర్టీసి సంస్థకు వచ్చే ఆదాయం మీదనే కాకుండా దానికి ప్రధాన కారణమవుతున్న ప్రయాణికుల సమస్యలపై కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. అధికారులకు వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగంగా డ్రైవర్లు బస్టాపుల్లో ఆపకుండా వెళుతన్నారని, అదే విధంగా, కొంత మంది కండక్టర్లు ప్రయాణికులు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధికంగా శివారు ప్రాంతాల నుంచి రావడంతో అధికారులు ఆ దిశగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. సంస్థకు ప్రధాన ఆదాయ వనరులైన ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవరిస్తే సహిచేంది లేదని ఇందుకు సంబంధించి క్రమశిక్షణా చర్యలకు కూడా వెనుకాడేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆర్టీసీ ఆదాయంపై దృష్టి
ప్రయాణికులతో ఏవైనా సమస్యలు వస్తే సాధ్యమైనంత వరకు వారికి అర్థమయ్యేలా చెప్పాలే కాని వారితో వాగ్వాదాలకు దిగడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు.రోజు రోజుకు నగరంలో ప్రజాప్రైవేట్ రవాణా వ్యస్థ అధికంగా అవుతుంది. అంతే కాకుండా ఇప్పటికే మెట్రో రైళ్ళు ప్రధాన మార్గాల గుండా పోతుండటంతో సంస్థకు ఆయా రూట్లలో నష్టం పెరిగిపోతోంది. ఇప్పటికే ఆయా మార్గాల్లో కొన్ని సర్వీసులను రద్దు చేసిన వాటిని ఇతర మార్గాల్లో నడపడం జరుగుతోంది. అంతే కాకుండా క్యాబ్‌లు సైతం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులను ఆకర్షిస్తు తమ ఆదాయాన్ని పెంచకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించాల్సిన బాధ్యత సంస్థపై ఉండటంతో సిబ్బంది ప్రయాణికుల పట్ల మర్యాద పూర్వక దోరణితో నడుచుకోవాలని వారికి చెబుతున్నారు.అంతే కాకుండా బస్టాపులేని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృషి సారించి అక్కడ ఏ ఒక్క ప్రయాణకుడు ఉన్నా బస్సు ఆపి మరి ఎక్కించుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో బస్సులను బస్టాపుల్లో ఆపాలని ఎందుకంటే ఆయా సమయాల్లో ప్రైవేట్ రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవని ఈ అంశాన్ని దృష్టి పెట్టకోవాలని చెబుతున్నారు. అంతే కాకుండా కాలనీల్లో సైతం బస్సుల నడిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రధానంగా మెట్రోకు సమీపంలో ఉండే కాలనీలపై మాత్రమే కాకుండా, బస్టాపులకు అర కిలో మీటర్ దూరం ఉన్న కాలనీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటి మీదుగా సర్వీసులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బస్టాపు దూరంగా ఉన్న కాలనీలు ఎన్ని ఉన్నాయి ?ఆయా ప్రాంతాల్లో ఎంత మంది ప్రైవేట్ రవాణాను ఆశ్రయిస్తున్నారు అనే అంశంలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వే కూడా చెసినట్లు చెబుతున్నారు.