ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్

హైద్రాబాద్, జనవరి 20, (way2newstv.com)
ఫిబ్రవరి మూడో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దాదాపు 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం 2020–-21 బడ్జెట్ను ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ప్రవేశపెట్టే చాన్స్ఉందని తెలిసింది. ఇప్పటికే అన్ని శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలను ఆన్ లైన్ లో ఆర్థిక శాఖకు పంపించాయి. 2019–20లో కేటాయించిన నిధులను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరి ఖర్చులకు మాత్రమే ప్రపోజల్స్ పంపించినట్టు సమాచారం. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టం సభ ముందుకు రానుంది.2019–-20 బడ్జెట్పై ఆర్థిక మాంద్యం ప్రభావం పడింది. 
 ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్

రూ.1.82 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ప్రవేశపెట్టగా, ఆర్థిక మాంద్యం  ప్రభావంతో పూర్తిస్థాయి బడ్జెట్ను  రూ.1.46  లక్షల కోట్లకు కుదించారు. దీంతో  ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయలేమని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్  ప్రకటించారు. కేంద్రం 2020–-21 బడ్జెట్‌‌ను ఫిబ్రవరి1న పార్లమెంట్‌‌లో ప్రవేశ పెట్టనుంది. ఇందులో రాష్ట్రానికి అదనంగా నిధుల కేటాయింపు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ఆశించిన స్థాయిలో నిధులు రాకపోతే ప్రస్తుత బడ్జెట్ కు అటుఇటుగానే కొత్త బడ్జెట్ఉండొచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న కేంద్ర పన్నుల వాటాను పెంచాలని తెలంగాణ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతమున్న 42 శాతాన్ని 50కి పెంచాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరింది. ఎఫ్ఆర్ బీఎం నిబంధనల మేరకు జీడీపీలో రుణ పరిమితిని 3 నుంచి 4 శాతానికి పెంచాలని, ఇరిగేషన్ పథకాల నిర్వహణ ఖర్చును కేంద్రం భరించాలని, మిషన్ భగీరథ పథకం నిర్వహణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది