భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్
న్యూఢిల్లీ జనవరి 1 (way2newstv.com)
దేశాన్ని శత్రుమూకల నుంచి రక్షించడం కోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే స్పష్టం చేశారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ఆర్మీ చీఫ్ అనంతరం సైనిక గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నరవణే మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్‌గా నా విధులను నిర్వర్తించడానికి తనకు ధైర్యం, బలం చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మానవ హక్కులను గౌరవించడానికి ప్రత్యేక శ్రద్ద చూపుతామన్నారు. చైనా సరిహద్దుకు సంబంధించి భారత బలగాలు సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టి సారించాయని పేర్కొన్నారు.
దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు అన్నివేళల సిద్ధం
అక్కడ శాంతి మరియు ప్రశాంతత నెలకొనే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భద్రతకు సంబంధించి అన్ని వేళలా సర్వసన్నధంగా ఉండడమే తమ తొలి ప్రాధాన్యమని మనోజ్ ముకుంద్ నరవణే స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్‌ను కట్టడి చేయడానికి భారత్ వద్ద పకడ్బందీ వ్యూహాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ చేపట్టిన దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమవ్వడం పాక్ ఆర్మీకి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. చైనా సరిహద్దులో బధ్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నామని తెలిపారు. ఉగ్రవాదులపై పాక్ చూపిస్తున్న అలసత్వానికి ప్రపంచ దేశాలు కూడా పాక్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదం ఏ విధంగా నష్టదాయకమొ ప్రపంచ దేశాలు గ్రహించాయని తెలిపారు. దేశంలో భద్రత వ్యవస్థను పటిష్టం చేసి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆర్మీని సిద్దం చేయడమే తమ లక్ష్యమని..మానవ హక్కులను కాపాడడానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ముకుంద్ నరవాణే తెలిపారు.