ఏఐ హబ్ గా హైద్రాబాద్, - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏఐ హబ్ గా హైద్రాబాద్,

హైద్రాబాద్, జనవరి 2, (way2newstv.com)
కొత్త ఏడాది 2020ను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సంవత్సరంగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఏఐ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏఐ బేస్డ్‌ ఎస్టిమేషన్‌ మేనేజ్‌మెంట్‌ అప్లికేషన్‌ ప్రారంభంతో పాటు 2020 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్యాలెండర్‌ను మంత్రి విడుదల చేశారు. 
ఏఐ హబ్ గా హైద్రాబాద్

ఈ నేపథ్యంలో మంత్రి సమక్షంలో పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. హెల్త్‌ కేర్‌, మోబిలిటీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇంటెల్‌, పీహెచ్‌ఎఫ్‌ఐ, ఐఐఐటీహెచ్‌లతో.. నివిదతో స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు... ఆడోబ్‌, కెపాసిటీ బిల్డింగ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు... ఐఐఐటీహెచ్‌తో ఎడ్యూకేషన్‌, ట్రైనింగ్‌... వాద్వాని ఆర్టిఫిషియల్‌తో, హెక్సగాన్‌ వ్యాపబుల్‌ సెంటర్‌ ఏర్పాటుకు, నార్వే క్లస్టర్‌ ఆఫ్‌ ఐప్లెడ్‌ ఏఐతో, మహింద్రా కాలేజీతో, నాస్కామ్‌తో ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. టెక్నాలజీ సామాన్యుడికి మేలు చేసే విధంగా ఉండాలన్నారు. టెక్నాలజీ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతిక ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు