స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
పెద్దపల్లి ,జనవరి 21(way2newstv.com)
పురపాలక ఎన్నికలో ఓటర్లు స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన   కోరారు.  జిల్లాలోని 4 మున్సిపాల్టీలలో  ఎన్నికలు నిర్వహిస్తున్నామని,  రామగుండం  మున్సిపల్ కార్పోరేషన్ లో 50 డివిజన్లలో 335 అభ్యర్థులు,  పెద్దపల్లి మున్సిపాల్టీలోని 34 వార్డులలో 155 అభ్యర్థులు,  సుల్తానాబాద్ మున్సిపాల్టీలోని 15 వార్డులలో 61 అభ్యర్థులు, మంథని మున్సిపాల్టిలో 13 వార్డులలో 50 అభ్యర్థులు పోటి పడుతున్నారని,  మొత్తం 241091 మంది తమ ఓటు  హక్కు వినియోగించుకుంటున్నారని  తెలపారు. 
స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

జిల్లాలో మొత్తం 366 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామని,  174 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్  కేంద్రాలుగా గుర్తించామని, 65 పోలింగ్ కేంద్రాలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసామని, 109 పోలింగ్ కేంద్రాలో   సూక్ష్మ పరిశీలకుల ద్వారా పోలింగ్ పరిశిలంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.   పురపాలక ఎన్నికలో ఓటర్లందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని , ప్రలోభాలకు గురికాకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు.