న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేస్తాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేస్తాం

 పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
మంత్రి కెటియార్ ను కలిసిన న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్
హైదరాబాద్ జనవరి 08 ( way2newstv.com)
న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈరోజు న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ బుధవారం మంత్రి కెటి రామరావును ప్రగతి భవన్ లో కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్టంలో న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలసి పని చేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. ఈ సమావేశంలో స్ధానిక రాజకీయ వ్యవస్ధల పనితీరుపైన ఇరువురు చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైన చర్చించారు. 
న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేస్తాం

ఈసందర్భంగా తెలంగాణలో ఉన్న పరిస్ధితులను మంత్రి కెటియార్, ప్రియాంకు వివరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం స్టార్ట్ అప్, ఇన్నోవేషన్ రంగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నదని, టిహబ్, విహబ్ వంటి ఇంక్యూబేటర్ల ద్వారా ఈ రంగంలో ముందున్నామన్నారు. దీంతోపాటు త్వరలోనే టి హబ్ రెండో దశ ప్రారంభం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని, ప్రస్తుతం ఉన్న వీదేశీ స్టార్ట్ అప్ ఇకో సిస్టంతో కలిసి పనిచేసేందకు ఉద్దేశ్యించిన టి- బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నామని తెలిపారు. టి బ్రిడ్జ్ కార్యక్రమంలో భాగంగా న్యూజిలాండ్ స్టార్ట్ అప్స్ తోనూ కలిసి పనిచేసేందుకు కృషి చేయాలన్నారు. దీంతోపాటు అగ్రిటెక్ రంగంలోనూ అనేక అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా పెద్ద ఏత్తున అందుబాటులోకి వస్తున్న సాగునీట ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగంలో, పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటికే ఇక్రిసాట్ తో అగ్రిటెక్ రంగంలో పనిచేస్తున్నామని మంత్రి కెటియార్ తెలిపారు. దీంతోపాటు న్యూజిలాండ్ ప్రధాని జస్సిండా అర్డన్ అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నారని, అమె నాయకత్వం పట్ల మంత్రి కెటియార్ ప్రసంశలు కురింపించారు. అమెకు కలిసేందుకు తాను సమావేశం ఎర్పాటు చేస్తానని, న్యూజిలాండ్ లో పర్యటించాల్సిందిగా ప్రియాంక, కెటియార్ ను కోరారు. ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రియాంక మంత్రి కెటియార్ కు తెలిపారు.తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటియార్ తో జరిగిన సమావేశం పట్ల ప్రియాంక హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏన్నారైలతో న్యూజిలాండ్ లో కలిసి పనిచేస్తున్నామని ప్రియాంకా తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.  దీంతోపాటు మంత్రి కెటియార్ తో సమావేశం ఏర్పాటు చేసేందుకు సహకరించిన న్యూజిలాండ్ టియారెస్ శాఖ నాయకులకు యంపి ప్రియాంక దన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఏన్నారై టియారెస్ కో అర్డినేటర్ మహేశ్ బిగాల ఉన్నారు.