కొనసాగుతున్న బంగారం పెరుగుదల - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొనసాగుతున్న బంగారం పెరుగుదల

ముంబై, జనవరి 25 (way2newstv.com)
బంగారం ధర మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. నిన్న పెరిగిన బంగారం ధర ఈ రోజు కూడా మళ్లీ పైకి కదిలింది. దీంతో ఇప్పుడు బంగారం కొనాలని ప్లాన్ చేసే వారికి ఇది ప్రతికూల అంశమనే చెప్పొచ్చు. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం సహా దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి బలహీనంగా ఉండటం కూడా పసిడి ధర పెరుగుదలకు దోహదపడిందని తెలిపారు.హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శనివారం పెరిగింది. 
కొనసాగుతున్న బంగారం పెరుగుదల

రూ.50 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.41,610 నుంచి రూ.41,660కు చేరింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.38,150 నుంచి రూ.38,190కు చేరింది.బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి రూ.60 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,000 నుంచి రూ.49,060కు పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఉండటం ఇందుకు కారణంఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38,190కు చేరింది. వెండి ధర కూడా రూ.49,060కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.36 శాతం పెరుగుదలతో 1571.10 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 1.60 శాతం పెరుగుదలతో 18.11 డాలర్లకు ఎగసింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 పెరుగుదలతో రూ.40,200కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.60 పెరుగుదలతో రూ.49,060కు చేరింది.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.