ఆంధ్రప్రదేశ్ కొత్త పరిపాలన రాజధాని గా విశాఖపట్నం ఖరారు? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆంధ్రప్రదేశ్ కొత్త పరిపాలన రాజధాని గా విశాఖపట్నం ఖరారు?

అమరావతి జనవరి 7 (way2newstv.com)
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానమైన సమస్యగా రాజధాని అంశం కొనసాగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు నాగరాలని అభివృద్ధి చేయబోతున్నాం అని ఏపీ ప్రభుత్వం చెప్తున్నప్పటి కూడా ..టీడీపీ నేతలు అమరావతి లోని కొందరు రైతులు అమరావతిలోని రాజధానిని ఉంచాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కొత్త పరిపాలన రాజధాని గా విశాఖపట్నం దాదాపు ఖరారు అయ్యింది. దీనిపై రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలింది. మిగిలిన అన్ని పనులు కూడా పూర్తీ కావడంతో ముందుగానే విశాఖకు కీలక శాఖలను తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే ..ఎవరెన్ని చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది అనుకున్న విధంగా జరిగేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. 
ఆంధ్రప్రదేశ్ కొత్త పరిపాలన రాజధాని గా విశాఖపట్నం ఖరారు?

ఇందులో భాగంగానే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న ఏపీ ప్రభుత్వం...ఆ దిశగా తోలి అడుగు వేయ బోతుంది.విశాఖలోని మిలీనియం టవర్స్ లో సచివాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఈ నెల 8న జరగబోయే కేబినెట్ భేటీ లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే రాజధాని తరలింపు ప్రక్రియకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత ఈ నెల 20వ తేదీ నుంచే విశాఖ లోని మిలీనియం టవర్స్లో కొత్త సచివాలయానికి శాఖల తరలింపు కోసం సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.విడతల వారీగా సచివాలయం తరలించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం... ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించాలని నిర్ణయించింది. జీఏడీ నుంచి మూడు సెక్షన్లు ఫెనాన్స్ శాఖ నుంచి రెండు సెక్షన్లు మైనింగ్ నుంచి రెండు సెక్షన్లు హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు రోడ్లు భవనాల నుంచి నాలుగు సెక్షన్లు తరలించాలని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ నుంచి నాలుగు సెక్షన్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత విద్య పాఠశాల విద్యాశాఖ నుంచి రెండేసి సెక్షన్లు తరలించాలని ఆలోచిస్తుంది. 34 శాఖల నుంచి కీలక విభాగాల తరలించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.