న్యూ ఢిల్లీ జనవరి 11 (way2newstv.com)
ఆరేబియా దేశం ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిల్ సయిద్ అల్ సయిద్ కన్నుమూశారు. ఆయన వయసు 79 ఏళ్లు. అరబ్ ప్రపంచంలో ఎక్కువ కాలం పరిపాలించిన సుల్తాన్‌గా ఖబూస్ బిన్ సయిద్‌కు గుర్తింపు ఉన్నది. సుల్తాన్ ఖబూస్ మృతి నేపథ్యంలో ఒమన్‌లో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఇటీవల బెల్జియంలో చికిత్స పొందిన తర్వాత ఆయన గడిచిన నెలలోనే ఒమన్ చేరుకున్నారు. సుల్తాన్ ఖబూస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. సుల్తాన్ ఖబూస్ అవివాహితుడు.
కన్నుమూసిన ఆరేబియా దేశం ఒమన్ సుల్తాన్ ఖబూస్
ఆయనకు వారసులు ఎవరూ లేరు. అయితే రాయల్ ఫ్యామిలీ కౌన్సల్‌లో ఉన్న సుమారు 50 మంది సభ్యులు మూడు రోజుల్లోగా కొత్త సుల్తాన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఒమన్‌లో 46 లక్షల జనాభా ఉన్నది. దాంట్లో 43 శాతం మంది విదేశీయులే. అయితే గత అయిదు దశాబ్ధాలుగా సుల్తాన్ ఖబూస్ ఒమన్ చరిత్రను మార్చేశారు. 1970 దశకంలో తన తండ్రి సయిద్ బిన్ తైమార్‌ను పక్కకు తప్పించి.. ఖబూస్ పాలన పగ్గాలను చేజిక్కించుకున్నారు. తండ్రి పాలనలో ఉన్న అనేక ఆంక్షలను ఖబూస్ ఎత్తివేశారు. సుల్తాన్ ఖబూస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఒమన్ దేశాన్ని ఆధుకరించిన గొప్ప దార్శనికుడు, రాజనీతజ్క్షుడు ఖబూస్ అని మోదీ కొనియాడారు. సుల్తాన్ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ ఆకాంక్షించారు.