అభివృద్ధి కి దూరంగా అనంతగిరి వాసుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అభివృద్ధి కి దూరంగా అనంతగిరి వాసుడు

హైద్రాబాద్, జనవరి 1, (way2newstv.com)
అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభుడు విలసిల్లుతున్నాడు. ఈ ఆలయానికి ప్రపంచంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లోకెల్ల ఓ ప్రత్యేకత ఉంది. అనంత పద్మనాభ స్వామి అనగానే..శేష తల్పంపై పడుకుని భక్తులకు దర్శమిస్తారు. అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి మాత్రం నిల్చుని ఉండటం స్వామివారి ప్రత్యేకత. ఇంతటి మహిమాన్మితుడైన అనంత పద్మనాభ స్వామికి ఓ చిక్కు వచ్చి పడింది.ఆలయం అటవీశాఖ పరిధిలో ఉందంటూ అటవీశాఖ అధికారులు ఆలయ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుపడుతున్నారు. చట్టాలు పుట్టక ముందే అనంతగిరిలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వెలిసారని చరిత్ర చెబుతుంది. 
అభివృద్ధి కి దూరంగా అనంతగిరి వాసుడు

దాదాపు 1300 ఏండ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉన్నప్పటికీ ప్రస్తుతం అటవీశాఖ అధికారులు మాత్రం అనంతుడిపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనంతుడి సమస్య ఏండ్లు గడిచినా పరిష్కారం కావడం లేదు.దీంతో ఇక్కడికి వచ్చే భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరం దగ్గరలోనే ఉండటంతో సెలవు దినాల్లో, ఇతర ప్రత్యేక రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది.అనంతుడి చెంత బస చేయాలనుకునే వారికి సరిపోను విడిది గదులు లేకపోవడంతో ఇక్కడికి వచ్చే భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విడిది గదులు నిర్మించాలన్న...మరింత అభివృద్ధి జరుగాలన్న అటవీశాఖ సమస్య తీరితేగాని ఏమి చేయలేని పరిస్థితి ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిధి అనంతగిరి అటవీ ప్రాంతంలో 53 ఎకరాల్లో విస్తరించి ఉంది. ముఖ్యంగా ఆలయ గర్భగుడి మినహా మిగతా ఆవరణ అంతా రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందంటూ అటవీశాఖ అధికారులు 2009 సంవత్సరం నుంచి ఆలయ అభివృదికి  ఆటంక పరుస్తున్నారు.గతంలో ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.60 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ఆవరణలో సీసీ రోడ్డు, ఇతరత్ర నిర్మాణాలు చేపట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు పూనుకోవడంతో అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పలుమార్లు ఆలయ అర్చకులు, దేవేదాయశాఖ అధికారులు, భక్తులు అటవీశాఖ కార్యాలమం ముందు ధర్నాలు సైతం నిర్వహించి అధికారు లు, మంత్రులకు విన్నపాలు ఇచ్చారుఅందరు ప్రజా ప్రతినిధులు విన్నపాలు స్వీకరించారు కానీ..ఆలయ సమస్యను తీర్చలేకపోయారు. కొందరు ఐఏఎస్ అధికారులు మాత్రం ఆలయ సమస్యను తీర్చేందుకు చొరవ చూపారు. గతంలో ఉన్న సబ్ కలెక్టర్ హరినారాయణ్, అలుగు వర్షిణి, కలెక్టర్ దివ్య లు చొరవ చూపి అటవీశాఖ, దేవాదాయ శాఖలతో జాయింట్ సర్వే చేయించారు. ఈ సర్వేలో ఆలయ పరిధిలో 33 ఎకరాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ 33 ఎకరాల్లో 5 ఎకరాలు మాత్రం రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 5 ఎకరాల లోపు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, 5 ఎకరాలు విస్తీర్ణం దాటితే కేంద్ర ప్రభుత్వ అనుమతితో దేవాలయాలకు కెటాయించే వీలుం టుంది. ప్రస్తుతం 5 ఎకరాలు మాత్రమే దేవాల య ఆవరణ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉన్నందు న రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి సమస్యను పరిష్కరించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. గత 9 ఏండ్లుగా రిజర్వు ఫారెస్టు పరిధి సమస్య కొనసాగుతుంది. ఆలయ పరిధి రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని చాలా సార్లు అటవీశాఖ అధికారులు పనులను అడ్డుకోవడం జరిగింది. ఈ మేరకు గతంలో జాయింట్ సర్వే నిర్వహించి దేవాదాయ కమీషనర్‌కు పంపడం జరిగింది.రిజర్వు ఫారెస్టు పరిధిలో కోనేటి ఆవరణలోని 5 ఎకరాలు మాత్రమే ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి ఆలయానికి కెటాయిస్తే సమస్య తీరిపోతుంది. ఇందుకు గాను సంబంధిత ఫైల్ ను దేవాదాయ కమీషనర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంప డం జరిగింది. ప్రభుత్వ అనుమతి పొందిన వెంటనే సమస్య తీరిపోతుంది. ఉన్నతాధికారులను కలిసినా. .ఏదో ఒక కారణం చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఒక్కమారు అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే సమస్య చక..చకా తీరిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను అనంతగిరిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనానికి తీసుకువస్తే సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది.