సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిలువు దోపిడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిలువు దోపిడి

హైద్రాబాద్, జనవరి 29, (way2newstv.com)
హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రైల్లో సెకండ్‌క్లాస్‌లో ప్రయాణం చేయడానికి ఎంత ఖర్చవుతుందో దానికి రెండింతలకు పైగా టా-వీలర్‌ ప్రయాణీకుల వద్ద రోజుకు రూ.425 వసూలు చేస్తున్న ప్రరిస్థితి సికింద్రాబాద్‌ స్టేషన్లో నెలకొంది. ప్రతీ రోజు 2 లక్షల మంది ప్రయాణం చేసే దక్షణమధ్య రైల్వే కేంద్రమైన ఈ స్టేషన్‌లో ప్రిమియం పార్కింగ్‌ బాదుడుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. టూ వీలర్‌ నుంచి మొదలుకొని ఫోర్‌ వీలర్‌ వరకు వేలల్లో వసూలు చేస్తున్నారు. పార్కింగ్‌ రుసుములను చెల్లించలేక వాహనాలను సైతం అక్కడే వదిలేసిన సంఘటనలు అనేకం. ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారో అధికారులకే తెలియాలి. బీజేపీ సర్కార్‌ దెబ్బకు రైల్వే స్టేషన్లు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిలువు దోపిడి

రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద రైల్వే స్టేషన్‌ సికింద్రాబాద్‌ను తన అనుబంధ సంస్థ ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కి కు అప్పగించిన తర్వాత తినే తిండి నుంచి మొదలుకొని పార్కింగ్‌ వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. రైల్వే స్టేషన్‌ ఆవరణలో మొత్తం నాలుగు పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన ద్వారం ఉన్న ' ప్రీమియం' పేరిట ఏర్నాటు చేసిన టూవీలర్‌ పార్కింగ్‌లో గంటకు రూ.18 చొప్పున రోజుకు రూ. 425 వసూలు చేస్తున్నారు. అలాగే ఫోర్‌వీలర్‌ పార్కింగ్‌లో కార్లు ప్రతి రెండు గంటలకు రూ.47 అంతకు మించి దాటితే ప్రతి గంటలకు రూ. 24 వసూలు చేస్తున్నారు. స్టేషన్‌ వెనక వైపు ఉన్న పదో నంబరు ప్లాట్‌ఫాం వద్ద ఫోర్‌వీలర్‌ వాహనాలకు ఏర్పాటు చేసిన పార్కిగ్‌ ఫీజు విచిత్రంగా వసూలు చేస్తున్నారు. ఈ నిబంధనలను ఏ ప్రాతిపదికన రైల్వే అధికారులు నిర్ణయించారు, దానిని ఎలా అమలు చేస్తున్నారనే దానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. ప్రతి 15 నిమిషాల వరకు రూ.100 చొప్పున, 15 నుంచి 30 నిమిషాల వరకు రూ.200గా నిర్ణయించారు. 30 నిమిషాలు దాటిన తర్వాత వాహనాలకు అక్కడ నిలపడానికి వీల్లేదు. అలా ఉంచిన వాహనాలకు రూ.500 అపరాధ రుసుం వేసి వాటిని పార్కింగ్‌ ప్రాంతంనుంచి తొలగిస్తామని ఇంగ్లీష్‌లో బోర్డులు పెట్టారు. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ సేపు ఉన్న వాహనాలకు వేలల్లో వసూలు చేస్తున్నారు. అయితే అలాంటి నిబంధన తాము విధించ లేదని ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ అంటున్నారు. అదికారుల ప్రమేయం లేకుండానే కాంట్రాక్టర్లు బోర్డులను తగిలించి వసూలు చేస్తున్నారరా? అనే ప్రశ్నకు రైల్వే అధికారుల వద్ద సమాధానం లేదు. స్టేషన్‌ ప్రధాన ద్వారం, పదో నంబరు ప్లాట్‌ఫాం వద్ద ఉన్న పార్కింగ్‌ కేంద్రాల వద్ద పార్కింగ్‌ చేసిన ప్రయాణికులు నిమిషాలు, గంటల్లో వసూలు చేస్తున్నారని తెలియక మోసపోతున్నారు. పండుగలకు, పబ్బాలకు ఊరెళ్లినప్పడు వాహనాలను పార్కింగ్‌ చేసి నిదానంగా వచ్చిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలో ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఒక్క ప్రీమియం పార్కింగ్‌ కేంద్రం వద్దనే దాదాపు 50కి పైగా వాహనాలను రుసుం చెల్లించలేక వదిలేసిన పరిస్థితి నెలకొంది.సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే అధికారులు ధరలు నిర్ణయించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ప్రయివేటుకు గాని తమ అనుబంధ సంస్థలకు గాని అప్పగించే ముందూ ధరల నియంత్రణకు రెగ్యూలేటరీ అథారిటీని నియమించాలంటూ వివేక్‌ దేబ్‌రారు కమిటీ సూచనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. టెండర్‌కు ముందు ధరలను నిర్ణయించి టెండర్‌ను కాల్‌ఫర్‌ చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు టెండర్‌ వేసిన తర్వాత కోడ్‌ చేసిన మొత్తాన్ని అంచనా వేసి వారికి నష్ట రాకుండా ధరలను నిర్ణయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరలు ఎలా నిర్ణయించినా ఇక్కడ నిర్ణయించిన ధరలు మాత్రం సామాన్యునికి చెమటలు పడుతున్నాయి.