ఎవ్వరికి పట్టని మిడ్ డే మీల్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎవ్వరికి పట్టని మిడ్ డే మీల్స్

వరంగల్, జనవరి 30, (way2newstv.com)
ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూండటంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నిర్వహణ లోపంతో భ్రష్టపడుతోంది. టేక్మాల్ మండలంలోని బర్దీపూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంకోసం వాడుతున్న బియ్యం పురుగులు పట్టి రంగుమారాయి. నాలుగు నెలలుగా అదే పరిస్థితి. వాటిని మార్చి మంచి బియ్యం తెచ్చుకునే సౌకర్యం ఉన్నా బాధ్యులు స్పందించడం లేదు. వంట చేసే సిబ్బంది నెత్తీనోరూ బాదుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో పురుగుల అన్నానే్న తప్పనిసరిగా విద్యార్థులు తినాల్సి వస్తోంది. లేదా పస్తులుండక తప్పడం లేదు.బర్దీపూర్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 60 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 
ఎవ్వరికి పట్టని మిడ్ డే మీల్స్

మధ్యాహ్న భోజనం కోసం గత యేడాది సెప్టెంబర్ మాసంలో 8 బస్తాల బియ్యాన్ని తీసుకువచ్చారు. బస్తాను విప్పగా అందులో బియ్యం పట్లుకట్టి పురుగులతో నిండిపోయాయి. బియ్యం రంగు మారింది. ఈ విషయాన్ని వంట చేసే నిర్వాహకులు ప్రధానోపాధ్యాయురాలికి చెప్పారు. వాటిని శుభ్రం చేసి వండి వడ్డించాలని ఆమె సూచించడంతో వంటవారు వాటినే వినియోగిస్తున్నారు.పురుగులు వస్తున్నా గత్యంతరం లేక విద్యార్థులు అదే భోజనాన్ని తింటున్నారు.. దీంతో అక్కడికి వెళ్లి చూడగా పురుగుల బియ్యం దర్శనమిచ్చాయి. ఈ విషయమై అక్కడ వంటచేసే వారిని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని, పురుగులు ఉన్న విషయం వాస్తవమేనని, ప్రధానోపాధ్యాయురాలికి చెప్పినా వినిపించుకోవడం లేదని, తప్పని పరిస్థితుల్లో తాము వంట చేయాల్సి వస్తోందని తెలిపారు.