హైదరాబాద్ జనవరి 7 (way2newstv.in)
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం నాడు తెలంగాణా ఆర్.అండ్.బి ఇంజనీర్స్ అసోసియేషన్ డైరిని ఆవిష్కరించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి గారి నివాసంలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ రవీందర్ రావు , చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్ అండ్ బీ డైరీని ఆవిష్కరించిన మంత్రి
ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరం డైరి ఆర్.అండ్.బి శాఖా సిబ్బంది సౌకర్యార్థం తీసుకురావడం జరుగుతుందని ఇందులో డిపార్ట్మెంట్ కి చెందినా అధికారుల పూర్తి సమాచారం మరియు మొబైల్ నెంబర్స్ పొందుపరచబడినవి అని సిబ్బంది మంత్రి కి వివరించారు.
Tags:
telangananews