న్యూ ఢిల్లీ జనవరి 28 (way2newstv.com)
చరిత్రాత్మకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఏఏతో పొరుగు దేశాల్లో ఉన్న మైనార్టీలను రక్షణ కల్పించనున్నట్లు ఆయన చెప్పారు.
అన్యాయాన్ని సరిదిద్దేందుకే పౌరసత్వ సవరణ చట్టం: ప్రధాని మోదీ
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్నవారు దేశ విభజనకు అంగీకరించారని, మైనార్టీలకు రక్షణ ఇవ్వాలని నెహ్రూ-లియాకత్ ఒప్పందం స్పష్టం చేసిందని, గాంధీజీ కూడా ఇదే కోరుకున్నారని, భారత్ ఇచ్చిన హామీని నేరవేర్చేందుకే సీఏఏ చట్టాన్ని తీసుకువచ్చినట్లు మోదీ తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నవారే సీఏఏను వ్యతిరేకిస్తున్నారన్నారు. పాక్‌లో ఉన్న మైనార్టీలను ఆదుకోవద్దా అని ఆయన అడిగారు. పారిశుద్ధ కార్మికులుగా కేవలం ముస్లిమేతరులు పాక్‌లో దరఖాస్తు చేసుకుంటారని గతంలో ఆ దేశ ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.