స్థానిక ఎన్నికల్లో దినకరన్ సత్తా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్థానిక ఎన్నికల్లో దినకరన్ సత్తా

చెన్నై, జనవరి 24  (way2newstv.com)
టీటీవీ దినకరన్. శశికళ మేనల్లుడు. ఆర్కే పురం ఉప ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించిన టీటీవీ దినకరన్ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. అయితే పార్టీ స్థాపించిన తర్వాత దినకరన్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. శాసనసభ ఉప ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ దినకరన్ పార్టీ డీలా పడింది. ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో దినకరన్ పని అయిపోయిందనుకున్నారు.అయితే ఇటీవల తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దినకరన్ పార్టీ సత్తా చూపింది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే విస్తుపోయేలా 90కి పైగా స్థానాలను కైవసం చేసుకోవడంతో దినకరన్ పార్టీపై మళ్లీ నేతల్లో నమ్మకాలు పెరిగాయి. 
స్థానిక ఎన్నికల్లో దినకరన్ సత్తా

శశికళ పరోక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించడంతో ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దినకరన్ పార్టీకి భవిష్యత్తు ఉందన్న సంకేతాలు బలంగా వెళ్లాయి.దీంతో దినకరన్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. త్వరలోనే శశికళ జైలు నుంచి విడుదల కాబోతోంది. శశికళ బయటకు వచ్చి తన పార్టీ వెంట నడిస్తే మరింత సానుకూలత వస్తుందని భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళను ప్రభుత్వాలు వేదించాయని ఆమెపై సానుభూతి పుష్కలంగా ఉందంటున్నారు. అంతేకాకుండా పార్టీని నడిపే శక్తి సామర్థ్యాలతో పాటు ఎన్నికల వ్యూహరచన కూడా శశికళకు కొట్టినపిండి. జయలలితను వెనక నుంచి నడిపించిన వ్యక్తిగా ఆమెకు పేరుంది.జైలు నుంచి వచ్చినర్వాత దినకరన్ పార్టీలో శశికళ క్రియాశీల పాత్ర పోషిస్తారంటున్నారు. అందుకోసమే ఇప్పుడు కొందరు నేతలు దినకరన్ పార్టీ వైపు చూస్తున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గెలవడంతో దినకరన్ ఎన్నికలను దీటుగా ఎదుర్కొనగలరనే పేరు పడిపోయింది. అధికార అన్నాడీఎంకేలో సరైన నాయకుడు లేకపోవడం కూడా తమకు కలసి వస్తుందని దినకరన్ భావిస్తున్నారు. మొత్తం మీద దినకరన్ కు కొత్త ఊపు వచ్చిందంటున్నారు.