నిదానంగా సాగుతున్న మేడారం పనులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిదానంగా సాగుతున్న మేడారం పనులు

వరంగల్, జనవరి 22, (way2newstv.com)
ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు మేడారం మహాజాతర జరగనుంది. కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారు. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తోంది. జాతర కోసం వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ చేయడానికి మేడారం చుట్టుప్రక్కల ప్రాంతాలలో 32 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. వెయ్యి ఎకరాలకు పైగా భూములను కేటాయించారు. ఈ స్థలాలను చదును చేసి అక్కడ ఏర్పాట్లు చేసే బాధ్యతను పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. జాతర మరో 15 రోజుల్లో స్టార్ట్‌‌ అవుతుండగా పార్కింగ్ స్థలాల అభివృద్ధి విషయమై సరైన ప్లానింగ్ లేకుండా పనిచేస్తున్నారంటూ ఉన్నతాధికారులు మండిపడుతున్నారు.మేడారం జాతర కొచ్చే ప్రైవేట్, ప్రభుత్వ, వీఐపీ, వీవీఐపీ వాహనాలు పార్కింగ్ చేయడానికి మేడారం చుట్టుప్రక్కల ప్రాంతాలలో అధికారులు 32 చోట్ల పార్కింగ్ స్థలాలను గుర్తించారు. మేడారం వై జంక్షన్, తాడ్వాయి వద్ద ఆర్టీసీ బస్సులు నిలిపేస్తారు. 
నిదానంగా సాగుతున్న మేడారం పనులు

వీఐపీ, వీవీఐపీ, బాషగూడెం, ఊరట్టం 1బీ, 2ఏ, 2బీ, 2పీ, కన్నెపల్లి 1, 2, జంపన్నవాగు, కొత్తూరు సబ్స్టేషన్, మరసుర ఆర్ఎఫ్, పోచమ్మ బంధన్, కొత్తూరు 1, 2, కాల్వపల్లి చెక్పోస్టు, కాల్వపల్లి క్రాస్రోడ్1, 2, బయ్యక్కపేట, చింతల్ ఆర్టీసీ, చింతల్ క్రాస్రోడ్1, 2, అరుమల్ల గుట్ట, యెర్ర చెరువు 1, 2, వెంగళాపూర్, తుర్కని చింతల్, బళ్లని చింతల్, యాసంగి తోగు, మొట్ల గూడెం వద్ద పార్కింగ్ స్థలాలు కేటాయించారు.ఫిబ్రవరి 5వ తేదీ కంటే ముందునుంచే వాహనాల రాకపోకలు పెరుగుతుంటాయి. మహా జాతర జరిగే ఆ నాలుగు రోజుల పాటు అయితే లక్షల్లో వాహనాలు రావడం ఖాయం. వీటన్నింటిని సరిగా పార్కింగ్ చేయకపోతే రోడ్డుపైనే ఉంటాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. తద్వారా ట్రాఫిక్ జామ్‌‌ అయి మొత్తం జాతరపైనే ప్రభావం పడుతుంది. సరైన పద్ధతిలో వాహనాలను పార్క్‌‌ చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే అన్నీ శాఖలకు పార్కింగ్ స్థలాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచనలు పంపించారు. ఆదివారం సుమారు 30 వేలకు పైగా వాహనాలు వస్తే వాటిని పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడంతో పోలీసులంతా చాలా ఇబ్బంది పడ్డారు. కన్నెపల్లి సమీపంలోని పంట పొలాలలో వాహనాలను పార్కింగ్ చేయించారు.మేడారం వచ్చే వాహనాలలో కొన్ని 2 నుంచి 5 రోజుల పాటు ఉంటాయి. కొన్ని మాత్రం అదే రోజు వచ్చి వెళ్లిపోతాయి. అయితే వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద డ్రైవర్లు, క్లీనర్లు, కొందరు ఓనర్లు ఉంటారు. అక్కడే నిద్రిస్తారు. వీరికి కనీస వసతులు కల్పించాలి. మరుగుదొడ్లు, మూత్రశాలలతో పాటు తాగునీటి సౌకర్యం ఉండాలి. అలాగే వాహనాలు ఎట్ల లోపలికి వెళ్లాలి?  ఎటునుంచి బయటికి రావాలి? తెలిపేలా ఇన్, అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలి. పార్కింగ్ ఏరియాలో ఎన్ని వెహికల్స్‌‌, ఎట్ల పార్క్ చేయాలనేది సుద్దతో మార్కింగ్ కూడా వేయాలి. రాత్రి వేళ వెలుతురు ఉండేలా లైట్లు అమర్చాలి. ఇవన్నీ సూచించేలా బోర్డులు పెట్టాలి. కానీ ఎక్కడా పనులు ఇట్ల చేయలేదు. కొన్ని చోట్ల అయితే ఇంకా స్థలాలను చదును కూడా చేయలేదు.