జేసీ దివాకరరెడ్డి అంశంపై చర్చ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జేసీ దివాకరరెడ్డి అంశంపై చర్చ

అనంతపురం, జనవరి 20, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి అంశం చర్చనీయాంశమైంది. జేసీ దివాకర్ రెడ్డి సూటైన, ఘాటైన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడుతున్నారు. నిజానికి ఇలాంటి ఎఫెన్స్ పాలిటిక్స్ నే తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. జగన్ దూకుడుకు కళ్లెం వేయాలంటే జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారికి పార్టీలో కీలక పదవి ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఓటమి పాలయిన తర్వాత టీడీపీలో ఫైర్ బ్రాండ్లుగా ముద్రపడిన నేతలు సయితం మౌనంగా ఉంటున్నారుజేసీ దివాకర్ రెడ్డి ఆరు నెలల నుంచి మౌనంగానే ఉన్నారు. అయితే తన ట్రాన్స్ పోర్టు కంపెనీకి చెందిన బస్సులపై దాడులు జరగడం, తాడిపత్రిలో టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకుంటుండటంతో జేసీ దివాకర్ రెడ్డి ఇక లాభం లేదని ఎఫెన్స్ లోకి వచ్చారు. 
 జేసీ దివాకరరెడ్డి అంశంపై చర్చ

జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జగన్ ఇక ఎంతకాలమో ముఖ్యమంత్రిగా ఉండలేరన్న ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ భారతి ముఖ్యమంత్రి అవుతారని కూడా జోస్యం చెబుతున్నారు. అంతేకాదు జగన్ ఇప్పటికే పెద్ద డీల్ చేసి వేల కోట్లు సంపాదించారని, గత ఎన్నికల సమయంలో కేసీఆర్ వద్ద తీసుకున్న సొమ్మును కూడా చెల్లించారని హాట్ కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే వారు కరవయ్యారు. అంతేకాదు చంద్రబాబు మినహా సవాళ్లు విసిరే వాళ్లు కూడా లేరనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు కేవలం లేఖలకే పరిమితమవుతున్నారు. ఆయన వల్ల పార్టీకి ఉపయోగం ఏమీ లేదన్నది పార్టీలో అత్యధికులు అంగీకరిస్తున్న అంశం. కళా వెంకట్రావు స్థానంలో జేసీ దివాకర్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తే జగన్ కు చెక్ పెట్టినట్లవుతుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారట.జగన్ సామాజికవర్గానికి చెందిన వాడే జేసీ దివాకర్ రెడ్డి కావడం ప్లస్ అవుతుందంటున్నారు. అంతేకాకుండా జగన్ అమరావతిపై ఒక సామాజికవర్గంపై చేసే దాడిని జేసీ ద్వారా తిప్పికొట్టవచ్చని సూచనలు కూడా అందుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి అమరావతి అంశంపై రాష్ట్రం మొత్తం తిప్పితే బాగుంటుందని కూడా కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే జేసీ దివాకర్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ధైర్యం చంద్రబాబు చేస్తారా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డిది నిలకడలేదని మనస్తత్వమని, ఆయనకు అంత కీలక పదవి ఇస్తే పార్టీకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మొత్తం మీద జేసీ దివాకర్ రెడ్డికి కీలక పదవి ఇస్తే బాగుంటుందని పార్టీలో అత్యధికులు అభిప్రాయంంగా ఉంది.