సమ్మర్ లో ఎన్పీఆర్ ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సమ్మర్ లో ఎన్పీఆర్ ప్రారంభం

హైద్రాబాద్, జనవరి 22, (way2newstv.com)
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో మే నుంచి ‘నివాసాల లెక్కింపు’ మొదలుకానుంది. ఈ ప్రోగ్రాంలో ఎన్యుమరేటర్లుగా టీచర్లే ఉండే నేపథ్యంలో ఎండా కాలం సెలవుల్లో చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచే ఎన్పీఆర్ తొలిదశను ప్రారంభించనున్నారు. అయితే రాష్ట్రాలు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా 45 రోజుల టైం పీరియడ్లో తొలిదశను పూర్తి చేసేందుకు కేంద్ర సర్కారు వీలు కల్పించింది. ఆ సమాచారం ఆధారంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జన గణన చేపట్టనుంది. సెన్సస్ నిర్వహించాల్సిన అవసరాన్ని, అమల్లో రాష్ట్రాల పాత్రను వివరించారు. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ డాక్టర్ వివేక్ ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సమ్మర్ లో ఎన్పీఆర్ ప్రారంభం

రాష్ట్రంలో మే నుంచి తొలిదశ ఎన్పీఆర్ ప్రారంభమయ్యే అవకాశముంది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇండ్లు (నివాసాలు) లెక్కిస్తారు. డివిజన్, మండలం, గ్రామ స్థాయిలో నివాసాల వివరాలను నమోదు చేస్తారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, టీచర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే ఎన్యుమరేటర్స్ గా టీచర్లే ఉంటారని, అందువల్ల ఎండాకాలం సెలవుల సమయంలో ఈ ప్రక్రియ చేపట్టవచ్చని రాష్ట్రానికి చెందిన ఒక కీలక అధికారి చెప్పారు. అంటే మేలో మొదలయ్యే చాన్సుందని తెలిపారు. రాష్ట్రంలో గత పదేండ్లలో కొత్తగా వందలాది కాలనీలు వెలిశాయని, మల్టీ స్టోరేజీ భవనాల నిర్మాణం పెరిగిందని చెప్పారు. ఈ వివరాలన్నీ సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారం ఆధారంగా 2021లో సెన్సస్ చేపడతారని.. అప్పుడు కూడా టీచర్లు ఎన్యుమరేటర్లుగా, డివిజన్ ఇన్చార్జులుగా పైఅధికారులు ఉంటారని వివరించారు.