భారత్ సూపర్ విక్టరీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారత్ సూపర్ విక్టరీ

న్యూఢిల్లీ, జనవరి 31 (way2newstv.com)
జిలాండ్‌తో జ‌రుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో ‘సూపర్’ విజయం సాధించింది. గత మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్ తొలుత టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా.. కివీస్ 13 పరుగులు సాధించింది. 14 పరుగుల టార్గెట్‌ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. లోకేశ్ రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్, ఫోర్ కొట్టడంతో 10 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి బంతికి రాహుల్ వెనుదిరిగాడు. ఈ దశలో కోహ్లీ వరుసగా ఒక డబుల్, ఒక ఫోర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 8 వికెట్ల‌కు 165 ప‌రుగులు చేసింది. 
భారత్ సూపర్ విక్టరీ  

మ‌నీశ్ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్, 3 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అనంత‌రం టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ మొత్తం ఓవర్లు ఆడి 165/7 చేసింది. కొలిన్ మున్రో (47 బంతుల్లో 64, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌. ఈ విజ‌యంతో సిరీస్‌లో భార‌త్ ఆధిక్యం 4-0కు పెరిగింది. ఆఖ‌రిదైన ఐదో టీ20 మాంట్ మాంగానీలో ఆదివారం జ‌రుగుతుంది.ఈమ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో, టిమ్ సీఫెర్ట్ (39 బంతుల్లో 57, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. వీరిద్ద‌రూ చెల‌రేగ‌డంతో కివీస్ టార్గెట్ వైపు ఆడుతూ పాడుతూ దూసుకెళ్లింది. విధ్వంస‌క ఓపెన‌ర్ మార్ట‌న్ గ‌ప్తిల్ (4) విఫ‌ల‌మైనా మున్రో-సీఫెర్ట్ రెండో వికెట్ 74 ప‌రుగులు జోడించారు. ఫిఫ్టీ అనంత‌రం మున్రో ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ఈద‌శ‌లో టామ్ బ్రూస్ (0) విఫ‌ల‌మైనా. వెట‌ర‌న్ రాస్ టేల‌ర్ (24)తో క‌లిసి సీఫెర్ట్ జ‌ట్టును విజయం అంచుల వరకు చేర్చాడు. అయితే కీలకదశలో వికెట్లు కోల్పోయిన కివీస్.. మ్యాచ్ ను టైగా ముగించింది.