విజయవాడ, జనవరి 23, (way2newstv.com)
రాష్ట్రం విడిపోతుందని తెలుసు. అయినా.. విడిపోదనే రాజకీయాలు సాగాయి. అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అవలంభించారనే వాదనను చంద్రబాబు ఎదుర్కొన్నారు. దీంతో ఏపీకి ఏం కావాలో చెప్పాలంటూ కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం కోరినా మౌనం వహించారు. అసలు రాష్ట్రమే విడిపోవడానికి వీల్లేదని తాము చెబుతుంటే ఇప్పుడు ఇలా అడగడం ఏంటి ఠాఠ్! మీకు బుద్ధుందా? అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇక, ఈయనకు వందిమాగధులుగా మారిన మరికొన్ని పార్టీల పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో అప్పట్లో ఏపీకి అన్ని విధాలా నష్టం జరిగిందని ఇప్పటికీ రోదిస్తున్నాం.కట్ చేస్తే.. ఇప్పుడు అమరావతిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం ముందుకే అంటోంది.
మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతమే.....
అప్పటికే అన్ని విధాలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోంది. ఉద్యోగుల కోరికలను తూ.చ. తప్పకుండా తీరుస్తామని ఇప్పటికే అనధికారికంగా ప్రకటించేశారు కూడా. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను విశాఖలో ఏర్పాటు చేసేందుకు అధికారులను కూడా పురమాయించారు.మరి ఇదే సమయంలో అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు కూడా ప్రభుత్వం మంచి ఆఫర్ ఇచ్చింది. మీకు ఏం కావాలో చెప్పండి.. అమరావతిలో పాలనా రాజధాని మాత్రం ఉండదు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసితీరాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రాంతీయ వాదం మరింత పెరిగి రాష్ట్రంలో విభజన రేఖలు వస్తాయని చెబుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఈ సమయంలోనూ బాధ్యతా యుతమైన చంద్రబాబు వంటి నాయకులు పిడివాదం పట్టుకుని పాకులాడడం ఎందుకో అర్ధం కావడం లేదన్న చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయి.ప్రభుత్వం చెబుతున్న విషయంతో చంద్రబాబు ఇప్పటికీ ఏకీభవించడం లేదు. ఇది అంతిమంగా అమరావతి రైతులకు తీరని నష్టం చేసినట్టే అవుతుంది. పైగా ప్రభుత్వమే ముందుకు వచ్చినప్పుడు వారి కోరికలను చెప్పుకొని తీర్చుకునే ప్రయత్నం చేయడం మానేసి.. ఇప్పుడు ఆందోళనలని పొద్దు పుచ్చితే.. అంతిమంగా రాష్ట్ర విభజన నాటి పరిస్థితి ఏర్పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. అదే టైంలో బాబుకు కేవలం రాజకీయం చేయడమే తప్పా నిజంగా రాష్ట్ర భవిష్యత్తు పట్టడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.