సివిల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా హైద్రాబాద్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సివిల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా హైద్రాబాద్

హైద్రాబాద్, జనవరి 21, (way2newstv.com)
సివిల్స్ కోచింగ్ కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. ప్రతి ఏటా ఢిల్లీతో పోల్చుకుంటే హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 40 ఏళ్ళ నుంచీ కోచింగ్ సెంటర్లు ఉండటంతో పాటు ప్రభుత్వం ఏపీ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడంతో IAS కోచింగ్ కు మరింత డిమాండ్ పెరిగింది.2011లో వచ్చిన ఆర్థికసంక్షోభంతో ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఉద్యోగాలపైనే విద్యార్థులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారు. ఐటీ ఫీల్డ్ లో ఉన్నవారు కూడా సివిల్స్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది కూడా హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ డిమాండ్ పెరగడానికి కారణమైంది. సిటీలో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా కోచింగ్ తీసుకునే సౌకర్యం ఉండటంతో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
 సివిల్స్ కు కేరాఫ్  అడ్రస్ గా హైద్రాబాద్

సిటీలో దాదాపు 150 సివిల్స్ కోచింగ్ సెంటర్లున్నాయి. ఇందులో పేరున్న ఇనిస్టిట్యూషన్స్ 15 నుంచి 20 మాత్రమే ఉన్నాయి. ఢిల్లీతో పోలిస్తే కోచింగ్ ఫీజుతో పాటు లివింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటోంది. ఢిల్లీలో ఒక ఇనిస్టిట్యూట్ లో 6 వందల మందిని ఒకే హాల్లో కూర్చోబెట్టి క్లాసులు చెబుతారు. అదే హైదరాబాద్ లో 50 నుంచి అత్యధికంగా 3 వందల మంది మాత్రమే ఉంటారు. ఫీజులు, లివింగ్ కాస్ట్ తక్కువగా ఉండటంతో హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోందంటున్నారు విద్యావేత్తలు.2013 నుంచి 16 మధ్యకాలంలో హైదరాబాద్ లో 57 శాతం ఎక్కువగా సివిల్స్ ఎగ్జామ్స్ కి అప్లయ్ చేశారు. వీళ్ళల్లో 64 శాతం మంది ఒక్క హైదరాబాద్ నుంచే క్వాలిఫై అయ్యారు. ప్రతి ఏటా సివిల్స్ లో హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నవారే ఎక్కువమంది అర్హత సాధిస్తున్నారు. కోచింగ్ తీసుకునే వారి సంఖ్య ప్రతీ ఏటా 20 శాతం పెరుగుతోంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్ కోచింగ్ కోసం హైదరాబాద్ కు వస్తున్నట్లు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీలో కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ ఇక్కడ కూడా కోచింగ్ ఇస్తున్నట్లు  చెబుతున్నారు.