తుంగభద్ర ప్రాంతాల్లో రంగు మారిన పంటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తుంగభద్ర ప్రాంతాల్లో రంగు మారిన పంటలు

అనంతపురం, జనవరి 29, (way2newstv.com)
తుంగభద్ర ఎగువ కాలువలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, హెచ్చెల్సీతోపాటు బోరు బావుల కింద సాగు చేసిన మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో పంట పూర్తిగా దెబ్బతింటోంది. విల్ట్ తెగులు సోకి మిర్చి రంగు మారడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉరవకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో దాదాపు 15 వేల ఎకరాల్లో డబ్బీ, బ్యాడిగి, నెంబర్ ఫైవ్, తేజ తదితర రకాల మిర్చి పంట సాగు చేశారు. నాలుగు నెలల క్రితం కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల మిర్చి పంటకు విల్ట్ తెగులు సోకి పంట ఎండిపోవడంతో చేసేది లేక తొలగించారు. 
తుంగభద్ర ప్రాంతాల్లో రంగు మారిన పంటలు

ఎలాగోలా పంటను కాపాడుకున్న రైతులకు అరకొర దిగుబడి వచ్చింది. అది కూడా మిర్చి రంగు మారడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఎకరాకు సుమారు రూ.80వేలు వరకు పెట్టుబడులు పెట్టామని ఈనేపథ్యంలో పంటను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోందని, అది కూడా రంగు మారడంతో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు రావడం లేదని అంటున్నారు. మరోవైపు పంటలను పరిశీలించి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన రైతులు కనె్నత్తి చూడటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుని మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు