చెల్లాచెదురైన కర్నూలు తమ్ముళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చెల్లాచెదురైన కర్నూలు తమ్ముళ్లు

కర్నూలు, జనవరి 7, (way2newstv.com)
క‌ర్నూలు జిల్లా శ్రీశైలం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? ఈ ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన బుడ్డా రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఏం చేస్తున్నారు ? ఇక్కడ కూడా హ‌వా చ‌లాయించాల‌ని ప్రయ‌త్నించిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఎలాంటి అనుభ‌వం ఎదురైంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చకు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు ప‌లుమార్లు విజ‌యం సాధించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ కేడ‌ర్ పూర్తిగా వైసీపీకి జైకొట్టిన నేప‌థ్యంలో ఇక్కడ కాంగ్రెస్ నాయ‌కులు కూడా త‌లోదారి చూసుకున్నారు.ఈ క్రమంలోనే 2014లో ఇక్కడి ప్రజ‌లు వైసీపి ప‌ట్టంక‌ట్టారు.
చెల్లాచెదురైన కర్నూలు తమ్ముళ్లు

వైసీపీ టికెట్‌పై పోటీ చేసిన బుడ్డా రాజ‌శేఖర్ రెడ్డి.. ఇక్కడ అనూహ్య విజ‌యం సాధించారు. అయితే, చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రానికి మంత్రముగ్ధుడైన రాజ శేఖ‌ర్‌.. 2017లో పార్టీ మారి టీడీపీకి జైకొట్టారు. అయితే, అదే స‌మ‌యంలో మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టి అఖిల ప్రియ‌కు రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి మ‌ధ్య ఆధిప‌త్య జోరు పెరిగింది. అఖిల ప్రియ త‌న వారికి కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నార‌ని, ప‌రోక్షంగా వైసీపీకి సాయం చేస్తున్నార‌ని రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌పై అఖిల ప్రియ కూడా అదే రీతిలో స్పందించారు. దీంతో ఇద్దరి మ‌ధ్య అప్పట్లో రాజ‌కీయంగా దుమారం న‌డిచింది.ఈ ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యానికి వైసీపీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియ‌ర్ నేత శిల్పా చ‌క్రపాణి రెడ్డి బ‌రిలో నిలిచారు. 2014 ఎన్నిక‌ల్లో అదే శిల్పా చ‌క్రపాణి రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా… ఆ త‌ర్వాత నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో శిల్పా సోద‌రులు పార్టీ మారిపోయారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున టికెట్ ఖ‌రారైన బుడ్డా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నామినేష‌న్ ముందు వ‌ర‌కు కూడా తాను పోటీ చేసేది లేద‌ని, త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేశారు. ఇక‌, చంద్రబాబు బ‌ల‌వంతంతో ఆయ‌న పోటీ చేశారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూపించ‌డం లేదు.త‌న బిజినెస్‌ల‌తోనే కాలం గ‌డుపుతున్నారు. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న పార్టీ నేత‌లే ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడ టీడీపీ జెండా మోసే నాధుడే లేకుండా పోయారు. సంస్థాగ‌తంలో ఉన్న నాయ‌క‌వ‌ర్గం కూడా తెర‌చాటున శిల్పాకు అనుకూలంగా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. టైం క‌లిసొస్తే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లే ప్రయ‌త్నాలు చేస్తున్నట్టు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా చ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే త్వర‌లో జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో అస‌లు పార్టీ త‌ర‌పున కేడ‌ర్‌కు భ‌రోసా ఇచ్చే నాథుడే క‌న‌ప‌డ‌డం లేదు. క‌ర్నూలు జిల్లాలో టీడీపీ అట్టడుగున ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో శ్రీశైలం కూడా ఒక‌టి. మొత్తానికి శ్రీశైలంలో పార్టీ ప‌రిస్థితి ఈ రేంజ్‌లో రివ‌ర్స్ అవుతుంద‌ని ఆ పార్టీ అధిష్టాన‌మే ఊహించి ఉండ‌దు.