హైదరాబాద్ జనవరి 25 (way2newstv.com)
తెలంగాణ మున్సిపోల్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ విజయకేతనం ఎగుర వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ఆనందం కలుగుతోందని ఉద్వేగానికి గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ పై మంత్రి కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్ లో మాట్లాడారు.
అభివృద్ధి పథకాల వల్లే ఇంతటి ఘన విజయం:మంత్రి కేటీఆర్
2014 నుంచి అమలు చేస్తూ వస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని కేటీఆర్ అన్నారు.ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా తనకు తెలంగాణ ప్రజలు ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. ఈ ఫలితాలు తన బాధ్యత ను మరింత పెంచాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.అంతకు ముందు తెలంగాణ భవన్ లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.