మంచిర్యాల్ జనవరి 27 (way2newstv.com)
జంతువుల కోసం వేటగాళ్లు పెట్టిన విద్యుదాఘాతానికి యువనాయకుడు, స్థానిక ప్రజాప్రతినిధి బలయ్యాడు. మందమర్రి మండలం, మామిడిగట్టు వద్ద చిర్రకుంట గ్రామానకి చెందిన ఎంపీటీసీ ఆసిఫ్(25) కరెంట్‌షాక్ తగిలి మరణించాడు.తన పొలానికి వెళ్తుండగా అడవిలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆసిఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
జంతువుల కోసం పెట్టిన విద్యుదాఘాతానికి ఎంపిటిసి బలి
కాగా, అడవిలో పందులు, కుందేళ్ల కోసం వేటగాళ్లు ఈ విద్యుత్‌తీగలు అమర్చినట్లు సమాచారం. వాటిని గమనించని ఆసిఫ్ విద్యుత్‌కు బలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యుత్ తీగలు అమర్చిన వేటగాళ్ల కోసం గాలిస్తున్నారు.